Wednesday, September 4, 2013

ప్రజలు పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలంటూ, తాను మాత్రం తగ్గించుకోనంటున్న ప్రభుత్వం....న్యూస్

దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకులను రాత్రి 8 నుండి పగలు 8 వరకు మూసివేయాలని, అప్పుడు గాని ప్రజలు పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోరని ఐడియా వేస్తున్న ప్రభుత్వం, ప్రభుత్వ నేతలూ, బాబులూ సంవత్సరానికి 3000కోట్ల రూపాయల విలువచేసే పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకునేందుకు మాత్రం ఐడియా వెయ్యరట.

దేశ వ్యాప్తంగా వాడబడుతున్న పెట్రొల్లో అత్యధిక వాడకం ప్రభుత్వానిదేనట. కానీ వారికి మాత్రం పెట్రోల్ వాడకం తగ్గించుకునే ఐడియా లేదట. ఇదెక్కడి న్యాయం. పెట్రోల్ వారు నింపుకుంటారట....డబ్బులు మీరూ, నేనూ ఇవ్వాలట.

పెట్రోల్ ను మంచినీటిలాగా ఖర్చుపెడుతున్న ప్రభుత్వం, తమ మంత్రులకూ, బాబూలకూ, రాష్ట్ర ప్రభుత్వ నేతలకూ, అధికారులకూ మాత్రం కంట్రోల్ పెట్టరట.

ప్రభుత్వ నేతలూ,బాబులూ అసలు పెట్రోల్ క్రింద ఎంత ఖర్చు పెడుతున్నారో సరైన లెక్క తెలియదట. ఎందుకంటే పెట్రోల్ కు అయ్యే ఖర్చును మిగిలిన ఖర్చులతో కలిపి "ఆఫీస్ ఎక్స్ పెన్సస్" క్రింద రాస్తారట. 2011-2012 లో డిల్లీ కేంద్ర ప్రభుత్వం "ఆఫీస్ ఎక్స్ పెన్సస్" క్రింద ఖర్చు పెట్టింది 5,200 కోట్ల రూపాయలట. ఇందులో చాలాభాగం పెట్రోల్ కేనట.

మినిస్టర్లూ, వారి సిబ్బంది (అంటే ప్రభుత్వ కార్యాలయ అధికారులు) నెలకు 2.56 లక్షల లిటర్ల పెట్రోల్ ను ఉచితంగా వాడుకోవచ్చ్హునట. ఇది కేవలం ప్రభుత్వ లెక్కల వరకే. కానీ దీనికంటే ఎక్కువే వాడుకుంటారట. ఇందులో వారు తమ సొంత పనులకు వాడుకోవటం ఎంతో మరి లెక్కవేయడం కష్టమట. ఇది కేంద్ర ప్రభుత్వ నేతలూ,బాబులూ ఖర్చు పెట్టే పెట్రోల్ లెక్క మాత్రమే. మరి రాష్ట్ర ప్రభుత్వ నేతలూ,బాబులూ ఖర్చుపెట్టే పెట్రోల్ లెక్క వేస్తే?.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెనుక 150 కార్లు వెళ్లడం చూసేనని ఒకరు చెబుతూంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన లుంగీ డిల్లీలో మర్చిపోయేరని, దానిని తీసుకురావడానికి ఒక హెలికాప్టర్ను రాష్ట్రం నుండి డిల్లీకి పంపించేరని మరొకరు చెప్పేరు. ఇలా ఎన్నో అనవసర పెట్రోల్ ఖర్చులు. లెక్క కట్టేదెవరు?.

ఇప్పటికే ఎన్నో విధాలుగా ప్రజలను పట్టి పీడిస్తున్న ప్రభుత్వ "దేశ అభివ్రుద్ది" పధకాలు, రూపాయి విలువను ఎంత తగ్గించిందో అందరికీ తెలుసు. దీని ప్రభావం కూడా దేశ ప్రజలపైనే పడుతుంది.

పెట్రోల్ బంకులకు నైట్ కర్ఫ్యూ వేయాలనే ఐడియా మానేసి, ప్రభుత్వం తాను చేస్తున్న ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో అనే ఐడియా వేస్తే....ప్రజలంతా వాట్ ఎన్ ఐడియా సార్ జీ అంటారు.

1 comment: