Thursday, September 12, 2013

పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వలన కలిగే నష్టాల గురించిన అద్భుత ప్రకటనలు....ఫోటోలు

కాలుష్యం పెరగడం, చెట్లు నరకడంతో అడవులు కుచించుకు పోవడం మొదలైన కారణాల వల్ల భూమి ఉష్ణోగ్రత నానాటికీ పెరిగిపోతోందని మనకందరికీ తెలుసు.

కాలుష్యానికి ముఖ్యమైన కారణం బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలను వాడినప్పుడు విడుదలయ్యే హరిత వాయువులు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టవచ్చు. అంతవరకు అది హరిత వాయువులను విడుదల చేస్తూనే ఉంటుంది. అలా విడుదలైన కార్బన్, మిథేన్ వంటి వాయువులు భూమి చుట్టూ ఒక పొరగా కమ్ముకుంటాయి. సూర్యుని కిరణాలు ఈ పొర ద్వారా భూమిపై పడతాయి. అప్పుడు కిరణాలతో పాటు అల్ట్రా వయోలెట్ రేడియేషన్ కూడా భూమిని చేరుతుంది. ఈ రేడియేషన్ భూమిని చేరగానే పరావర్తనం చెంది తిరిగి ఆకాశంలోకి వెళ్లకుండా హరిత వాయువుల పొర అడ్డుకుంటుంది. అప్పుడు ఆ వేడి వల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది.

గత వంద సంవత్సరాలుగా ‘గ్లోబల్ వార్మింగ్’ పెరుగుతూనే ఉంది. వనరులను, శిలాజ ఇంధనాలను మనిషి తన స్వార్థానికి విచ్చలవిడిగా వాడి పర్యావరణ సమతుల్యాన్ని నాశనం చేస్తున్నాడు. వనరులను, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించినప్పుడే ‘గ్లోబల్ వార్మింగ్’ ప్రభావాన్ని తగ్గించగలం.

ఈ విషయాన్ని తెలియపరుస్తూ విడుదలైన ప్రకటనలే ఇవి.


No comments:

Post a Comment