Friday, September 27, 2013

విధి వంచితములో(శపించబడిన)మునిగిన ఇటాలీ లోని గైయోలా ద్వీపం....ఫోటోలు

ఇటాలీ నగరమైన నాప్లెస్ దగ్గరగా ఉన్న గైయొలా ద్వీపం, అక్కడి ప్రజలచే శపించబడిన ద్వీపముగా పిలువబడుతోంది. ఎందుకంటే 1920 నుండి ఈ ద్వీపాన్ని కొనుకున్న వారందరూ ఎ కారణమూ లేకుండా మరణానికి గురి అయ్యేరు. 1920 లో ఈ ద్వీపానికి యజామని అయిన స్విస్ హన్స్ బ్రౌన్ అనే అతను ఒక రోజు దుప్పటితో కప్పబడి మరణించి యున్నాడు. కొన్ని రోజుల తరువాత అతని భార్య సముద్రములోకి దూకి ఆత్మహత్య చేసుకుందట. ఆ తరువాత ఈ ద్వీపాన్ని కొనుకున్న జెర్మన్ ఒట్టో గ్రన్ బాక్ అనే అతను అక్కడున్న ఒక విల్లాలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి కనిపించేడట. ఆ తరువాత ఆ ద్వీపాన్ని కొనుకున్న మౌరీస్ యువస్ సాండోస్ అనే ఫార్మాసీటికల్ కంపెనీ అధినేత పిచ్చిపట్టి స్విజర్లాండ్లోని ఒక మెంటల్ హాస్పిటల్లో ఆత్మహత్యచేసుకున్నాడట. ఆ తరువాత ఈ ద్వీపాన్నీ కొనుకున్న జర్మనీకి చెందిన కోట్లకు అధిపతి అయిన స్టీల్ కంపెనీ అధినేత బ్యారన్ కారల్ పౌల్ లాంగ్ హీం సంపాదించుకున్న డబ్బంతా నష్టపోయి దివాలా తీసేడట. ఆ తరువాత ఈ ద్వీపాన్ని కొనుకున్న జియన్నీ అగ్నిల్లే తన భందువులలో చాలామందిని పోగొట్టుకున్నాడట. చివరిగా ఈ ద్వీపాన్నీ కొనుకున్న గ్రపోనే అనే అతను చేయని నేరానికి జైలుపాలయ్యేడట. 2001 నుండి ఈ ద్వీపమును ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇప్పుడది అతి పెద్ద టూరిస్ట్ స్పాట్ గా మారింది.


No comments:

Post a Comment