Monday, September 30, 2013

భారతదేశంలో అద్దె తల్లులు-అతిథిగృహాలు....ఫోటోలు

దేశ రాజధాని నగరం విదేశీయులకు అద్దె గర్భాలు విక్రయించే కేంద్రంగా మారిపోతోంది. తక్కువ ధరలో అద్దె తల్లుల (సరోగసీ) ద్వారా సంతానాన్ని పొందాలనుకునే దంపతులు ఢిల్లీని ఎంచుకుంటున్నారు. ఈ విధానంలో గర్భిణి పిండాన్ని అద్దెతల్లి తన కడుపులో మోసినందుకు డబ్బులు చెల్లిస్తారు. అద్దెగర్భాలను నియంత్రించేందుకు మనదేశంలో పటిష్ట చట్టాలు లేకపోవడంతో ఎందరో భారతీయ పేద మహిళలు ఇతరుల గర్భాలను తమ శరీరాల్లో మోస్తున్నారు. దీనికితోడు భారత్‌లో అతి తక్కువ మంది మహిళలకు మాత్రమే ధూమపానం, మద్యం వంటి దురలవాట్లు ఉంటాయి. అందువల్ల ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యవంతులైన మహిళలు అందుబాటులో ఉంటారు కాబట్టే విదేశీయులు ఢిల్లీ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

ప్రతి నెలా వేలాది మంది.. అద్దెతల్లుల కోసం తమను సంప్రదిస్తుంటారని ఢిల్లీలోని సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ఢిల్లీలో ప్రతినెలా కనీసం 100 విదేశీ జంటలు అద్దెతల్లుల ద్వారా సంతానాన్ని పొందుతున్నారట.

అద్దెగర్భాల సంఖ్యపై కచ్చితమైన సమాచారం అందుబాటులో లేనప్పటికీ, ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వారిలో 90 శాతం మంది ప్రవాస భారతీయులు ఉంటారని, మిగిలిన 10 శాతం మంది మాత్రమే విదేశీయులు ఉంటారని ఆస్పత్రులు చెబుతున్నాయి. అయితే అద్దెగర్భం ద్వారా సంతానం కోరుకునే విదేశీయులు సదరు మహిళలకు చాలా షరతులు పెడుతున్నారు. గర్భం సమయంలో ఆమెపూర్తి ఆరోగ్యంగా ఉండడానికి వీలుగా అతిథిగృహాల్లో మాత్రమే బస చేయాలని కోరుతున్నారు. గర్భం కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

‘అద్దెగర్భాలను జాగ్రత్తగా పర్యవేక్షించాలి. విదేశీయులు ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండదు’ అని ఒక దళారీ చెప్పాడు. కమీషన్ పద్ధతిలో ఇతడు దంపతులకు అద్దెతల్లులను సరఫరా చేస్తుంటాడు. ప్రవాస భారతీయులు మాత్రం తమ కులం, మతానికి చెందిన తల్లులు మాత్రమే పిండాన్ని మోయాలని కోరుకుంటున్నారు. విదేశీయులు ఇలాంటి నిబంధనలను పట్టించుకోవడం లేదు. గర్భాన్ని మోసే మహిళ సంపూర్ణ ఆరోగ్యం, శుభ్రంగా ఉంటే చాలని భావిస్తున్నారు. అతికొద్ది మంది మాత్రమే కవలలను డిమాండ్ చేస్తున్నారని సదరు దళారీ వివరించారు.

ఆన్‌లైన్ వీడియో చాట్ ద్వారా ఆమె పిండం ఎదుగుదలను తరచూ పరిశీలిస్తారని ఆయన వివరించారు. ఇలా ప్రత్యేకతలను కోరుకునే విదేశీయులు అద్దెతల్లులు అడిగినంత మొత్తం చెల్లించడానికి వెనుకాడడం లేదని అతను చెప్పాడు. ‘విదేశీయుల నుంచి రూ.12.5 లక్షల వరకు వసూలుచేస్తాం. ప్రవాస భారతీయులు అయితే రూ.8.5 లక్షల దాకా చెల్లిస్తారు. విదేశీయులను మా దగ్గరికి తీసుకొచ్చే దళారులు కూడా 20 శాతం కమీషన్ తీసుకుంటారు’ అని మరో దళారి వివరించాడు.


ఫోటో క్రెడిట్: రుయటర్స్.

ఏగిరే మిషెన్ల(విమానాలు/రాకెట్లు)కాక్పిట్ ఎలా ఉంటాయో చూడండి....ఫోటోలు

F22 Raptor
The upgraded C-130 Hercules
Endeavor Space Shuttle
B-17 bomber
Apollo Lunar Module
Soviet Antonov An-225 Mriya, the largest aircraft in the world
The Concorde
Boeing 787
Boeing AH-6I helicopter
MiG-23 Flogger
C-32 98-0002 (a.k.a. Air Force Two)
Airbus A380
Boeing 747

పెరు దేశంలోని కొండమీదున్న 16 వ శతాబ్ధమునాటి రాళ్ళ శవపేటికలు....ఫోటోలుSunday, September 29, 2013

వియత్నాం లో కుక్క మాంసం ఒక పెద్ద వ్యాపారంగా మారింది....ఫోటోలు

తాయ్లాండ్ నుండి వియత్నాం కు దొంగతనంగా కుక్కలను తరలిస్తున్న లారీ ను పోలీసులు పట్టుకొవడంతో, కుక్క మాంస వ్యాపారం ఎంతగా అభివ్రుద్దిచెందిదో అంచనా వేయగిలిగేరు. కుక్క మాంసం తినడం చైనా, మెక్సికో,రోం, వియత్నాం మరియూ సౌత్ కొరియాలలో పూర్వకాలంలో ఉండేదని, ఆ తరువాత అది తగ్గిపోయిందని అధికారులు అనుకున్నారు. కానీ ఈ మధ్య కుక్కలను ఎగుమతి చేయడం ఎక్కువ అవడంతో వియత్నాం అధికారులు కుక్కల రవాణా మీద నిఘా ఉంచేరు.


అమెరికా నౌకాదళ హాస్పిటల్ ఓడలు....ఫోటోలు

ఈ అమెరికా నౌకాదళ హాస్పిటల్ నౌకలలో ఒకటి అవసరమైన చొట్లకు వెళ్ళి సేవలు అందిస్తుంది. రెండవది ఓడలోనే ఇన్ పేషంట్లను ఉంచుకుని సేవ అందిస్తుంది. ఈ నౌకలు అమెరికా సైనిక దళాలకే కాక ఎమర్జన్సీ అవసరంలో ఎక్కడికైనా వెళ్ళి సేవలు అందిస్తుంది.