Wednesday, August 21, 2013

సింగపూర్ లో నిలువగా (Vertical) ఉండే పొలాలు..... ఫోటోలు

స్థలం కొనాలంటే సింగపూర్ లో అది ఒక విలాసమైన విషయం. ఎవరూ కొనలేరనే చెప్పవచ్చు. ఎందుకంటే దానికి కారణం 2 విషయాలు. ఒకటి, అత్యంత ఖరీదు పెట్టాలి. రెండు, అక్కడ స్థలం కొరత. సింగపూర్ మొత్త వైశాల్యమే 710 చదరపు కిలోమీటర్లు. సింగపూర్ జనాభా 5మిల్లియన్ల పైగానే ఉంటుంది. అందుకే ఇక్కడా ఎత్తైన భవనాల వరుస కనబడుతుంది. ఇక్కడ పంట పొలాలు లేవు. అక్కడి ప్రజలకు దొరుకుతున్న ఆహారంలో 93 శాతం దిగుమతి చేసుకున్నదే.కానీ ఒక అభ్యుదయేచ్ఛ పారిశ్రామికుడు నిలువుగా ఉండే తోటను నిర్మించి సుమారు ఒక టన్ను తాజా కూరగాయలు పండించి అక్కడివారికి అందిస్తున్నాడు.


No comments:

Post a Comment