Thursday, August 1, 2013

గూగుల్ వారి ఉన్నతమైన ఉత్పాదనలు.... వివరాలు మరియూ ఫోటోలు

మీకందరికీ తెలుసు. గూగుల్ ఒక సెర్చ్ ఇంజెన్ మాత్రమే కాదని. గాడ్జెట్ తయారీలో, ఇంటర్నెట్ సర్వీసులలో, స్మార్ట్ ఫోన్ అప్ప్లికేషన్... ఇలా ఎన్నో వాటిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద లీడర్ గా ఉంటున్నది. వీరి ఉత్పాదనలలోనే అత్యంత ఉత్సాహపరిచేది రహస్య ప్రాజక్ట్ X. ఈ X ప్రాజెక్ట్ లలో ఒకటే ప్రపంచవ్యాప్తంగా వయర్ లెస్ ఇంటర్నెట్ సేవలకోసం గాలి ఓడలు తయారుచేస్తున్నది. ఇది శిఖరంలోని కొన మాత్రమే. వారి ప్రాజెక్ట్ లలో కొన్ని ఇక్కడ చూడండి.

Driverless Car.....ఈ కార్లను ప్రస్తుతం కాలిఫోర్నియా మరియూ నివెడా నగరాల వరకే అమలుచేస్తారు.

Google Glass......ఈ కళ్ళద్దాలు వేసుకుంటే స్మార్ట్ ఫోన్లు మరియూ కంప్యూటర్లను మరిచిపోవచ్చు. కావలసిన సమాచారం ఒక కంటికి తెలుస్తుంది. క్యాలండర్, ఈ-మైల్, షోషియల్ నెట్ వర్క్ లూ, వాతావరణ సూచనలూ... ఇలా మనకు ఏ సమాచారం కావాలన్న అందిస్తుంది. ఇదొక అద్భుతమైన టెక్నాలజీ. ప్రస్తుతం కొంతమంది అద్రుష్టవంతులకు ముఖ్యంగా డెవెలపర్లకూ, పత్రికా విలేఖరులకూ పంపినీచేస్తున్నారు. బహుస 2014లో ఈ కళ్ళద్దాలు ప్రజల అందుబాటులోకి వస్తుంది.

"Smart Home" from Google......ఈ టెక్నాలజీని ఆండ్రాయడ్ @ హోం అంటారు. ఇది ఇంటర్ నెట్ మూలంగా జీవిత సహాయ ఉపకరణగా పనిచేస్తుంది. ఉదాహరణకు, మీరు ఇంట్లో లేనప్పుడు రిఫ్రిజిరేటర్ మీరు ఎప్పుడూ వాడుకగా ఉంచుతున్న వస్తువులను ఇంటర్ నెట్ మూలంగా రీటైల్ షోరూములకు ఆర్డర్ పెడుతుంది. అలాగే కాఫీమేకర్ మీరు ఇంటికి వస్తున్నారనగానే కాఫీ రెడీగా ఉంచుతుంది. ఇది వెర్రితనంగా అనిపించవచ్చు. కానీ బిల్ గేట్స్ తన ఇంట్లో దీనిని వాడుతున్నారట. ఈ గాడ్జెట్ గురించి ఇంతవరకు ఆయన కంప్లయంట్ చేయలేదు.

Space Elevator......2011 గూగుల్ రహస్య X టీం వారు స్పేస్ (అంతరిక్ష) ఎలివేటర్ తయారుచేసి దాని మూలముగా ప్రజలనూ, వస్తువులను అంతరిక్షంలోకి పంపాలని ప్రాజక్ట్ వేసేరు. దీనిని అమలుపరచాలంటే ఎన్నో టెక్నికల్ ప్రాబ్లంస్ ఉన్నాయి. బహుస ఈ ప్రాజక్ట్ చేయలేక పోవచ్చు. కాలమే దీనికి సమాధనం చెబుతుంది.

Android SmartWatch......ఈ మద్యే గూగుల్ సంస్థ ఆపిల్ కంపనీవారు తయారుచేస్తున్న ఐ వాచ్ కు పోటీగా దీనిని తయారుచేస్తున్నారు. గూగుల్ వారి ఉత్పాదనలో స్మార్ట్ ఫోన్ కూడా ఉంటుంది. 2014 లో ఇది మార్కెట్ లో దొరకవచ్చు.

Google will take care of your health....అడిమాబ్ అనే ఒక హెల్త్ కేర్ సంస్థలో భాగం ఉన్న గూగుల్, వారితో కలిసి వ్యాది ఏమిటో తెలుసుకునే సెన్సార్లు, వ్యాధికి అవసరమైన చికిత్సా సెన్సార్లను తయారుచేయబోతున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది, శరీరములోని వ్యాధి నిరోధక కణాలైన WBC ని ఉత్సహా పరిచి వ్యాధి పెరగకుండా నివారించడమే.

Internet airships to make the entire world WiFi hotspot.......ప్రపంచవ్యాప్తంగా వయర్ లెస్స్ ఇంటెర్ నెట్ సేవలు అందిచాలనే ఉద్దేశంతో ఉత్పాదన చేస్తున్నారు. దీనితో భూమండలంలోనీ ప్రతిచోటూ ఇంటర్ నెట్ సేవలు అందుకుంటాయి.

Game console based on Android.......వీరి టీవీలలో ఆండ్రాయడ్ మూలంగా అన్ని సేవలూ దొరుకుతాయి

Google and Motorola.....మోటోరోలా కంపెనీని గూగుల్ కొనుకున్నది. మోటోరోలా మూలంగా అత్యున్నతమైన గూగుల్ స్మార్ట్ ఫోన్ త్వరలో వెలువడబోతున్నది.

Eco-friendly sources of energy.....మకానీ పవర్ కంపెనీతో కలిసి గాలిలో ఎగురుతూ సన్నటి గాలి నుండి కరెంటు తీసే యంత్రాన్ని తయారుచేస్తున్నారు.

No comments:

Post a Comment