Wednesday, August 7, 2013

షార్ట్ ఫిల్మ్ తీయుటకు కధలు కావలెను


అందరికీ వందనములు

నేను తింక్ క్రియేషన్స్ బ్యానర్ మీద షార్ట్ ఫిల్మ్ లు తీస్తున్నాను. ఇప్పటిదాకా 4 షార్ట్ ఫిల్మ్ లు తీసేను. మరో 3 షార్ట్ ఫిల్మ్ లకు స్క్రిప్టులు రెడిగా ఉన్నాయి. వాటిని అతి త్వరలో మీ ముందుంచుతాను. ప్రతి షార్ట్ ఫిల్మ్ లోనూ ఒక మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది.

మీలో చాలామందికి ఎన్నో ఐడియాలు ఉంటాయి, వాటికి చిన్న రూపం ఇచ్చి ఒక కధగా చేయండి. వాటిని మాకు పంపండి. మీ చిన్న ఐడియాలను ఒక చిన్న కధగా డెవెలప్ చేసి, స్క్రిప్టు తయారుచేసి దానిని షార్ట్ ఫిల్మ్ గా తీస్తాను. టైటిల్స్ లో కధ మీదనే మీ పేరు వేస్తాను.

ఇది ఈ మధ్యే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మా 4 వ షార్ట్ ఫిల్మ్ పోస్టర్

మీలో కొంతమంది ఇదివరకే కధలు రాసి, అవి పత్రికలలో ప్రచురించి ఉండవచ్చు. వాటిని కూడా పంపవచ్చు. ఈ విషయాన్ని మీ స్నేహుతలకూ, తెలిసినవారికీ తెలియపరచి వారినికూడా ఎంకరేజ్ చేయండి.

మీరు మొదటి పనిగా మీ ఆసక్తిని telugushortfilms4u@gmail.com కు ఒక మెసేజ్ గా తెలియపరచండి. తిరుగు టపాలో మీకు మా చిరునామా తెలుపుతూ మెసేజ్ వస్తుంది. ఆ చిరునామాకు మీ కధలనూ, ఐడియాలను పంపండి. మీ కధ మాకు నచ్చిన వెంటనే మీకు ఇంటిమేట్ చేస్తాము. ఆ తరువాత మీ కధకు స్క్రిప్ట్ రెడీచేసి దానిని షార్ట్ ఫిల్మ్ గా తీసేముందు మీకు తెలియపరుస్తాము. ఆ తరువాత షార్ట్ ఫిల్మ్ పూర్తి అయిన తరువాత దానిని యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తరువత మీకు తెలియ పరుస్తాము.

ఇంతవరకు మేము తీసిన షార్ట్ ఫిల్మ్ లను చూడదలుచుకుంటే ఇక్కడకు వెళ్ళి చూడవచ్చు:http://www.youtube.com/user/telugushortfilms4u

మీకోసం.

No comments:

Post a Comment