Tuesday, August 27, 2013

అంతర్జాల ప్రేమ...హాస్య పూర్వమైన సంభాషణ


కూతురు: డాడీ, చాలా దూరంలో ఉన్న ఒక అబ్బాయిని ప్రేమించేను. ఎంత దూరమంటే, నేను ఇండియాలో ఉన్నాను, అతను అలస్కాలో ఉన్నాడు.

మీమిద్దరం ఒక డేటింగ్ వెబ్ సైట్ లో కలుసుకున్నాము. ఫేస్ బుక్ లో స్నేహితులమయ్యేము. వాట్స్ ఆప్ లో చాలాసేపు చాటింగులు చేసుకున్నాము. స్కైప్ మూలంగా అతను నాకు ప్రపోస్ చేసేడు. గత రెండు నెలలుగా వైబర్ మూలంగా బాంధవ్యంలో ఉన్నాము.

మీ ఆశీర్వాదమూ మరియూ దీవనలూ కావాలి.

తండ్రి: ఓ అలాగా....ట్విట్టర్ లో పెళ్ళిచేసుకోండి.టాంగోలో సరదాగా ఉండండి. ఈ-బేలో పిల్లలను కొనుక్కోండి. వాళ్ళను జీ-మైల్ మూలం తెప్పించుకోండి.

ఎప్పుడైన నీకు భర్త మీద విసుగుపుడితే అమజాన్ లో అతన్ని అమ్మేసేయ్.

No comments:

Post a Comment