Monday, August 12, 2013

అనుకోకుండా కనుగొనబడ్డ మమ్మీ లు....ఫోటోలు

700-Year-Old Mummy.....700 సంవత్సరలనాటి మమ్మీ....ఈస్ట్రన్ చైనాలో రోడ్డ్లు వేస్తున్న పనివారు 2011 లో రోడ్డుకోసం తవ్వుతున్నప్పుడు కనబడిందింది ఈ మమ్మీ. 1368-1644 లో నివసించిన మనుష్యులలో ఒకరు. ఇందులో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఈ మమ్మీ చెక్కు చెదరలేదు.
Sacrificed Inca Children....1999 లో చిలి దేశంలోని ఒక కొండ ప్రాంతంలో కనుగొనబడ్డ ఈ మమ్మీలు 500 సంవత్స్రాల క్రితం నాటివి. బహుస దేమునికి బలి ఇచ్చే మూఢ నమ్మకంకోసం తల్లీ బడ్డలను మమ్మీలుగా పూడ్చి పెట్టి ఉండవచ్చునని అనుకుంటున్నారు.
Rosalia Lombardo...ఇటాలీ కి చెందిన Rosalia Lombardo అనే ఈ పిల్లవాడు ఇన్ ఫ్లుయంజా వ్యాధితో చనిపోయేడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేని తండ్రి తన కొడుకును బద్రపరచవలసినదిగా కోరేడట. ఒక గాజు శవపేటికలో బద్రపరచబడ్డ ఈ పిల్లవాని అన్ని ముఖ్య అవయవములూ పాడైపోకుండా ఇంకా చక్కటి స్థితిలోనే ఉన్నాయని చెబుతున్నారు.
2,400-Year-Old Egyptian Mummy with a Brain Removal Tool....2012 లో మెదడు వెలికి తీసే పరికరంతో ఒక మమ్మీని కనుగొన్నారు. పరిశోధనా నిమిత్తం మెదడు తీసి మమ్మీలుగా ఉంచే అలవాటు 3,500 సంవత్సరాల మునుపు చేసేవారట. కనుగొనబడ్డ ఈ మమ్మీ 2,500 సంవత్సరాల క్రిందటిదట. ఆ రోజుల్లో మెదడు వేరు చేసే పరికరంతో పాటూ ఉన్న్ మమ్మీలలో ఇది చాలా ప్రసిద్దిచెందినది.
Strange Mummy Found by a 10-Year-Old...అలాక్జాండర్ అనే 10 ఏళ్ళ జెర్మనీ కుర్రాడు తన అమ్మమ్మ రూములోని ఒక పాత చెక్కపెట్టె నుండి ఈ మమ్మీని కనుగొన్నాడు. ఈ మమ్మీ శరీర భాగాలు వేరువేరుగా బద్రపరచబడి ఉన్నాయి. 1950 లో నార్త్ ఆఫ్రికా నుండి మమ్మీలను తీసుకొచ్చే జర్మన్ గ్రూపులు కొన్ని ఉండేవట. బహౌస వారు తీసుకువచ్చి బద్రపరిచిన ఇంట్లోకి అలక్జాండర్ కుటుంభం నివాసమేర్పరుచుకునుంటుందని అభిప్రాయపడుతున్నారు.
Egyptian Mummy “Dressed” in Roman Robes....2010 లో కైరో నగరానికి 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక శ్మశానంలో ఈ మమ్మీని కనుగొన్నారు. సుమారు 2000 సంవత్సరాల క్రిందటి ఒక చిన్న పాపలాగా ఉన్న ఈ మమ్మీ ఎందుకు రోం దుస్తులలలో అలంకరించబడి ఉన్నదో తెలుసుకోలేకపోతున్నారు.
2,000-Year-Old European Found in China....1990 లో చైనాలో దొరికిన ఈ మమ్మీ యూరోపియన్ దేశస్తులకు చెందినది. ఈ మమ్మీ చైనాలో దొరకడం అధికారులను ఆశ్చర్యపరుస్తోంది.
Plomo Mummy...స్పైన్ దేశ కొండలలో కనుగొనబడ్డ ఈ మమ్మీ ఒక పిల్లవానిదని, మూఢ నమ్మకాల కారణం గానే ఈ పిల్లవానిని బలి నిమిత్తం అక్కడ ఉంచేరని చెబుతున్నారు.
ఈ మమ్మీలు కూడా మూఢ నమ్మకాల గుర్తువేనని చెబుతున్నారు.

No comments:

Post a Comment