Monday, August 19, 2013

64కు పడిపోయిన రూపాయి విలువ....వివరాలు/ఫోటోలు/కార్టూన్లు

64కు పడిపోయిన రూపాయి విలువ

ఈరోజు కూడా కూడా రూపాయి పతనం ఏమాత్రం ఆగలేదు. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజిలో ఈరోజు ఉదయం జరిగిన ట్రేడింగులో మరో 98 పైసలు దిగజారి, డాలర్ తో పోలిస్తే 64.11 వద్ద ట్రేడయింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం అయినప్పుడు 63.75 స్థాయిలో ఉన్నా, తర్వాత మరింతగా పడిపోయింది. అమెరికన్ కరెన్సీ కోసం బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి గట్టి డిమాండు ఉండటంతో పాటు ప్రధానమైన విదేశీ కరెన్సీలు వేటితో పోల్చిచూసినా డాలర్ బలం పెరగడంతో రూపాయి పతనం కొనసాగిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే బాండ్ల కొనుగోలు కార్యక్రమాన్ని చేపడుతుందన్న వదంతులు వినిపించడంలో డాలర్ మరింత బలపడింది.

రూపాయి పతనాన్ని అడ్డుకోడానికి భారతీయ రిజర్వు బ్యాంకు పలు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించినా, అవేవీ ఇంతవరకు ఫలితాన్ని ఇవ్వలేదు. దాదాపు దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా నిన్న ఒక్కరోజులోనే రూపాయి ఏకంగా 148 పైసల మేర పడిపోయిన విషయం తెలిసిందే.

దశాబ్దంలోనే అత్యధికంగా పడిపోయిన రూపాయి....రూపాయి: చేతకాకపోతే సరి! -కార్టూన్

రూపాయి బతుకు కనాకష్టంగా మారింది. ఆర్.బి.ఐ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రూపాయి పతనం కొనసా…….గుతూనే ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మన దేశ కరెన్సీ రూపాయి విలువ.... అమెరికా కరెన్సీ డాలరుతో సమానం. ఇపుడు ఆ రూపాయి విలువ అరవై రెట్లు తగ్గిపోయింది. ఒక డాలరు కోసం ఇపుడు మనం అరవై నాలుగు రూపాయలు ఇవ్వాలిసుంది.

“ఏం భయపడొద్దు. అది మరింత జారిపోకుండా ఎక్కడో ఒకచోట ఆగి తీరాల్సిందే!”....ఏదీ రూపాయి, ఎక్కడా కనబడదేం? -కార్టూన్

రాజకీయ నాయకుడు: “రూపాయి చాలాకనిష్ట స్ధాయిలో ఉంది. ఇప్పుడూ – దాన్ని ఇంకా మెరుగ్గా గవర్న్ చెయ్యొచ్చంటారా?”
దీని వలన మన దేశ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుంది. మరి మన నాయకులు రూపాయి పతనాన్ని ఆపగలరా?


No comments:

Post a Comment