Saturday, August 10, 2013

40 సంవత్సరాలుగా నాగరికతకు దూరంగా అడవిలోనే నివసించిన తండ్రీకొడుకులను కనుగొన్నారు....ఫోటోలు

ఆగస్ట్ 7, 2013 న వియత్నాంలోని అడవిలో నాగరికతకు దూరంగా నివసిస్తున్న తండ్రీకొడుకులను ఆ చుట్టుపక్కలున్న గ్రామస్తులు కనుగొన్నారు. వెంటనే అధికారులకు తెలియపరిచేరు. అధికారులు వారిరువురినీ అక్కడి నుండి నాగరికత ప్రపంచానికి తీసుకువచ్చి చికిత్స చేసి వారిని నాగరీక సంఘంలో చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రికి 82 ఏళ్ళు, కొడుకుకు 42 ఏళ్ళు. వారిరువురూ మాట్లాడుకుంటున్న భాష ఎవరికీ అర్ధం కావటంలేదట. మాట్లాడటం కూడా సరిగ్గా రావడంలేదట. అధికారులూ, మిగిలిన ప్రజలూ వారికి మాటలు నేర్పిస్తున్నారట. 1971 లో జరిగిన యుద్దంలో వారున్న చోట బాంబులు పడి చాలామంది చనిపోయేరట. వీరి కుటుంభంలో కూడా నలుగురు చనిపోతే, తండ్రి, కొడుకును తీసుకుని అడవిలోపలకు వెళ్ళి తలదాచుకుని అక్కడే ఉండిపోయేరట.

No comments:

Post a Comment