Sunday, August 25, 2013

2010 భూకంపం తరువాత హైతీలో ప్రజలు....వీడియో


ఈ శతాబ్దంలో అత్యంత ప్రమాదకరమైన భూకంపం కరేబియన్ దేశం హైతీలో ఇటీవల సంభవించింది. ఈ దేశం జనాభా కోటి మంది మాత్రమే. హైతీ అంటే పర్వతాల ప్రదేశం అని అర్ధం. ఫ్రెంచి వలస పాలనలో ఈ దేశ ప్రజలు మగ్గిపోయారు. అయితే లాటిన్ అమెరికాలో స్వాతంత్య్రం పొందిన తొలి దేశం హైతీ. 1804లో జనవరి 1వ తేదీన ఫ్రాన్స్ నుండి ఇది స్వాతంత్య్రం పొందింది. ఫ్రెంచి విప్లవ స్ఫూర్తితోనే హైతీ పోరాటం సాగింది. సుమారు వందేళ్ల పాటు బానిస నాయకులు పదేపదే తిరుగుబాటు చేసి స్వేచ్ఛను ప్రసాదించారు. హైతీ రాజధాని పోర్టు ఔ ప్రిన్స్ . ఆ దేశంలో అధికార భాషలు హైలియన్, ఫ్రెంచి. 95 శాతం మంది ఇక్కడ నల్లజాతీయులే ఉంటారు. విస్తీర్ణం 27,751 చదరపుకిలోమీటర్లు. ప్రకృతి ప్రకోపానికి హైతీ స్మశాన వాటికగా మారిపోయింది. ఎటు చూసినా శవాల గుట్టలే మిగిలాయి. దాదాపు లక్ష మంది భూకంపంలో చనిపోయి ఉంటారని అంచనా. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఈ భూకంపంలో 50వేల మంది మరణించి ఉంటారని అంచనా. 30 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. లక్షలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, చట్టసభల సభ్యుల ఆచూకీ నేటికీ తేలలేదు.ఈ భూకంపంలో అధికారిక భవనాలతో పాటు ఐక్యరాజ్యసమితికి చెందిన భవనాలు కూడా కుప్పకూలాయి. చివరికి దేశ అధ్యక్ష భవనం కూడా ధ్వంసం అయింది. భూకంపం గురించి తెలియగానే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కదిలిపోయింది. పెద్ద ఎత్తున సహాయ పునరావాస చర్యలకు కదిలి వచ్చింది.


ఇప్పుడు హైతీలో ప్రజలు

No comments:

Post a Comment