Thursday, August 22, 2013

సిరియాలో ప్రజలపై ప్రభుత్వం రసాయన దాడి?!: ఒకేరోజు 1300మంది మృతి....న్యూస్ మరియూ ఫోటోలు

సిరియాలో అంతర్యుద్ధం పరాకాష్టకు చేరుకుంది. ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నేతృత్వంలోని సైన్యం బుధవారం రెచ్చిపోయింది. తిరుగుబాటుదారులపై సైన్యం తెగబడి ఏకంగా రసాయనిక ఆయుధాలను ప్రయోగించింది. బుధవారం డమాస్కస్‌లో సమీపంలోని ఫౌటా ప్రాంతంలో 1300 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారులకు స్థానిక ఆసుపత్రిలో వైద్యం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సంచలనం సృష్టించాయి. అనేక మంది వీధుల్లోనే ఎక్కడికక్కడ పడిపోయిన దృశ్యాలు నివ్వెరపరిచాయి. తిరుగుబాటు ప్రాంతాల్లో జనంపై సిరియన్ సైన్యం రసాయనిక ఆయుధాలను ప్రయోగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. విష వాయువులు ప్రయోగించి వందలాది మందిని క్రూరంగా చంపినట్లు తిరుగుబాటుదారుల కూటమి ఎల్‌సీసీ పేర్కొంది. తూర్పు ఫౌటాలో బాంబు దాడులు కొనసాగుతున్నాయని పెద్దసంఖ్యలో ఆసుపత్రులకు చేరుతున్న బాధితులకు సరైన వైద్యం అందడం లేదని తెలిపింది. సిరియాలోని ప్రతిపక్షాలు కూడా రసాయనిక ఆయుధాలతో దాడి చేశారన్న అనుమానాన్ని వ్యక్తంచేశాయి.


మనసును కలతపరిచే వీడియో ఇది....ధైర్యమున్నవారే చూడవలెను.

No comments:

Post a Comment