Sunday, July 7, 2013

వ్యక్తిగత ఇంటర్ నెట్ స్వేచ్చ పై అమెరికా ఎన్.ఎస్.ఏ(N.S.A) జరుపుతున్న గూఢచారత్వం పై అమెరికాలో నిరసనలు....ఫోటోలు

అమెరికా గూఢచార సంస్థలు ఇంటర్ నెట్ కంపెనీల సమాచారం ఆధారంగా దేశ విదేశాలలోని ప్రజల నుంచి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నాయని ఇటీవల కొన్ని పాశ్చాత్య పత్రికల ద్వారా వెల్లడైంది. అమెరికా ఎక్కువగా సమాచారం సేకరిస్తున్న ఐదు దేశాలలో భారత్ కూడా ఉన్నది. ఈ-మెయిల్స్ మొదలుకొని ఫోన్ సంభాషణల వరకు పౌరులను గూఢచార సంస్థలు కనిపెట్టి ఉండడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రతి రాజ్యంలో మెజారిటీ, మైనారిటీ వర్గాలుంటాయి. భిన్న భావజాలాల ప్రజలు ఉంటారు. భిన్న రాజకీయ పక్షాలుంటాయి. ప్రభుత్వం పట్ల, వ్యవస్థ మీద అసంతృప్తి ఉన్న వర్గాలు ఉంటాయి. అసమ్మతిని, భిన్నత్వాన్ని గౌరవించడమే ప్రజాస్వామ్యం. సాంకేతిక పరిజ్ఞానాన్ని చేత బూనిన ప్రభుత్వం పౌరుల కదలికలపై నిఘా వేస్తూ ఉంటే-అట్టడుగు వర్గాలకు, అల్పసంఖ్యాక వర్గాలకు, అసమ్మతి బృందాలకు బతుకే దుర్భరమవుతుంది. ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశం రాజ్యమేలుతుంది. ‘ప్రిజం’ అనే కార్యక్షికమం పేర అమెరికా గూఢచార్యం సాగిస్తున్న విషయం బయట పడిన వెంటనే భారత్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నదని ఒక ఆంగ్ల పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించడం గమనార్హం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికే కఠిన చట్టాలు చేస్తున్నామని, పౌరుల హక్కులపై పరిమితి విధిస్తున్నామని ఇప్పుడు అనేక దేశాలు చెప్పుకుంటున్నాయి. కానీ ఏ కారణంగానై భారీ ఎత్తున ప్రజల ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించడం శ్రేయస్కరం కాదు. ఉగ్రవాదాన్ని రూపు మాపడానికి ప్రభుత్వాలు ఇతర మార్గాలు అన్వేషించాలే తప్ప, అందుకు ప్రజాస్వామ్య విరుద్ధమైన చట్టాలు తేవడం సమర్థనీయం కాదు. ఈ విధానం క్రమంగా ప్రజాస్వామ్య వ్యవస్థల మౌలిక స్వభావాన్ని మార్చివేస్తుంది.

No comments:

Post a Comment