Monday, July 8, 2013

అమెరికాలో నేల గుమ్మడి మొక్కలు ఎలా పెరిగినయో చూడండి...ఫోటోలు

నేల గుమ్మడి అడవిలో దొరికే ఒక ఔషధ మొక్క. ఫాబేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం ప్యురేరియా ట్యూబరోసా (Pueraria Tuberosa), సంస్కృత నామం విదారి కంద. ఆంగ్ల పరిభాషలో ఈ మొక్కను ఇండియన్ కుడ్జు అని అంటారు. కొన్ని గిరిజన గ్రామాల్లో నేలగుమ్మడిని దారి గుమ్మడి అని కూడా అంటారు. ఈ మొక్క భారత దేశంలో ఉన్న తూర్పు కనుమలు, పడమటి కనుమలు, మరియు ఈశాన్య రాష్ట్రాల అడవుల్లోను, నేపాల్ మరియు పాకిస్థాన్ దేశాల్లోను కనిపిస్తుంది. గిరిజనులు ఈ మొక్క నుండి లభించే రసాన్ని చర్మ వ్యాధులకి, లైంగిక పటుత్వానికి వాడతారు. ఒరిస్సా మయూర్ భంజ్ జిల్లాలో గిరిజనులు కీళ్ళ నొప్పులకి నేలగుమ్మడి వేరును ముద్దగా చేసి ఒంటికి వ్రాసుకుంటారు . ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో గిరిజనులు గుండె నొప్పి వచ్చే సమయంలో విదారికంద వేరుని పొడిలో పంచదార కలిపి మాత్రలుగా చేసి, రోజుకు 2 సార్లు చొప్పున 4 లేక 5 రోజులు సేవిస్తారు. నిస్సత్తువ నుండి ఉపశమనం పొందడానికి ఉడికించిన విదారికంద వేళ్లను రోజుకు 2 సార్లు చొప్పున 3 వారాలు తింటారు. అక్రమ చొరబాటుదారుల వల్ల ప్రస్తుతానికి ఈ నేలగుమ్మడి జాతి అంతరించిపోయే దశలో ఉంది.

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. చీకట్లో ఒంటరిగా వీటి పక్కకి వెళ్తే దడుచుకు చావటమేగా నాలాంటి పిరికి మేళాలు:-)

    ReplyDelete