Sunday, July 7, 2013

అంగట్లో చనుబాల అమ్మకం: వెర్రితలలేస్తున్న చైనా సంపన్నుల విలాసం....ఇది ప్రచ్ఛన్న అశ్లీలత.....న్యూస్

అమ్మ పాలను మించిన అమృతం లేదంటారు. చిన్నారులకు ఆర్నెల్లవరకూ తల్లిపాలు తప్ప వేరే ఏదీ పట్టించవద్దనీ చెబుతారు. అంతేకాదు తల్లీబిడ్డల బంధం మరింత పెనవేసుకునేందుకు ఇదెంతో అవ సరమంటారు. కానీ చైనాలో డబ్బు మదమెక్కిన సంపన్నులు పురిటి బిడ్డల్లా తల్లుల స్తన్యం ఆస్వాదించేందుకు ఎగబడుతున్నారు. ఇదో విలాసంగా భావిస్తూ వేలకువేల డాలర్లు చెల్లించేందుకూ వెనుకాడటంలేదు.
వెర్రితలలేస్తున్న ఈ సంస్కృతికి మార్కెటింగ్ హంగులు జోడిస్తూ వ్యాపారసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నెలకు 16వేల యువాన్లు (రూ.2 లక్షల కుపైగా) చెల్లిస్తే చాలు.బాలింతలవద్ద చనుబాలు నేరుగా తాగే సౌకర్యం కల్పిస్తామంటూ ప్రచారంతో ఊదర గొడుతున్నాయని 'సదరన్ మెట్రోపోలిస్ డైలీ' కథనం పేర్కొంది. "నేరుగా తాగడానికి ఇబ్బందనిపిస్తే బ్రెస్ట్ పంపుతో ఎంచక్కా తాగే అవకాశం కూడా ఉంది'' అని 'జిన్‌జిన్యూ' సంస్థ యజమాని లిన్‌జున్ ప్రకటించడం గమనార్హం. ఆ దేశంలో నానాటికీ విస్తరిస్తున్న ఈ కొత్త సంస్కృతిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువె త్తుతున్నాయి.
An advertisement hiring wet nurses is seen in Chengdu in southwest China. Wet nurses are hired to provide human breast milk for adults in Shenzhen, south China's Guangdong province. [Photo/news.sohu.com]
తల్లీబిడ్డల బంధాన్ని ఇది పలుచన చేస్తోందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ మేరకు 'అంగట్లో చనుబాల అమ్మకం'పై చైనా ట్విటర్‌గా పేరుగాంచిన 'సినవీబో'లో సమాజ శ్రేయోభిలాషులు వ్యాఖ్యలు రాశారు. చైనాలో మహిళ వ్యాపార వస్తువుగా మారిపోతోందని, సంపన్నుల్లో నైతిక పతనమే ఇందుకు నిదర్శనమని కావో బోయిన్ అనే విమర్శకుడు తన బ్లాగ్‌లో ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన మాత్రమే కాదు. ఆన్‌లైన్‌లో 90శాతం చైనీయులు ఇదే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఇది ప్రచ్ఛన్న అశ్లీలత మినహా మరేమీకాదని దుయ్యబట్టారు.
అయితే.. ఈ సంస్కృతి ఒక్క చైనాకే పరిమి తంకాదు. బ్రిటన్‌లో 2010లోనే ఓ సంస్థ దీన్ని మరో రూపం లో ప్రవేశపెట్టింది.ఇక ఏడాది గడిచేసరికి (2011లో) లండన్ సంస్థ ఒకటి ఏకంగా చనుబాల ఐస్‌క్రీమ్‌లను మార్కెట్‌లోకి తెచ్చింది. అయితే, తల్లిపాలను మానవ క్షేమం కోసం వినియోగిస్తున్న ఉదాహరణలూ ఉన్నాయి. తల్లిపాలు కరువైన బిడ్డలకోసం జాతీయ ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం చనుబాల బ్యాంకులను రిజిస్టర్ చేసుకునే వీలు కల్పించింది. అలాగే కేన్సర్ రోగులకు, వ్యాధి నిరోధకత తగ్గిన వారికి, జీర్ణకోశ సమస్యలున్నవారికి అమెరికా లో డాక్టర్లు తల్లిపాలనే మందుగా సూచిస్తుంటారు. అంతేకాదు ఎన్నో పోషకాలున్న తల్లిపాలలోని ఔషధ గుణాలపై కాలి ఫోర్నియాలో పరీక్షలు కూడా జరుగుతున్నాయి.

No comments:

Post a Comment