Saturday, July 27, 2013

నిద్ర పోలేకపోతున్నారా? అయితే చంద్రునిపై నింద మోపండి....న్యూస్

మీరు సరిగ్గా నిద్రపొలేదా. అయితే దానికి కారణం చంద్రుడే నని పరిశోధకులు తెలియజేసేరు. పరిశోధనలలో విశ్వసనీయమైన నిదర్శనం దొరికిందని పరిశోధనా శాస్త్రవేత్తలు తెలియజేసేరు. చంద్రుని లయలు మనుష్యులలోనూ,ప్రాణులలోనూ నిద్రాభంగం కలిగిస్తుందని సైన్స్ మొదటిసారిగా తెలియపరిచింది......ఆంగ్లములో చంద్రున్ని మూన్ అని పిలిచినా లాటిన్ బాషలో "లూనార్" అని పిలుస్తారు. ఈ పేరు(లూనార్) అసలు లునాటిక్(lunatic)అనే పదం నుండే వచ్చింది.

మన వాళ్ళు అంటుంటారు "వీడికి అమావాస్యకు, పున్నమికి పిచ్చి ఎక్కువ అవుతుంటుంది జాగ్రత్త" అని. కానీ పరిశోధకులు అమావాస్యకూ మానవులకు ఎటువంటి సంబంధం లేదని కచ్చితంగా చెబుతున్నారు. కొన్ని పరిశోధనలు అమావాస్య నాడు మానవుని మనోభావాలు మారుతాయని చెప్పినా, 1985 లో దీనిని పరిశోధకులు పూర్తిగా కొట్టిపారేసేరు. 33 వాలింటీర్లను పరిశోధించినప్పుడు వారు నిద్రలో ఉన్నప్పుడు వారి మెదడులో ఎటువంటి చురుకుతనం తగ్గలేదు, కానీ అమావాస్యనాడు వారిలో వారి మెదడు చురుకుదనం 33 శాతం తగ్గిందని తెలిపేరు. పూర్తి పరిశోధనా వివరాలు త్వరలో తెలియపరుస్తానని Psychiatric Hospital of the University of Basel in Switzerland శాస్త్రవేత్త Christian Cajochen చెప్పేరు.

No comments:

Post a Comment