Friday, July 19, 2013

స్పెల్లింగ్ సరిదిద్దే పెన్ను....ఫోటోలు మరియూ వీడియోలు

స్పెల్లింగ్ తప్పుగా టైప్ చేస్తే సరిదిద్దే కంప్యూటర్లను చూశాం. మొబైల్స్‌నూ చూశాం. ఇప్పుడ మనం రాసే పదాల స్పెల్లింగ్‌లను గుర్తించే స్మార్ట్ పెన్ను కూడా త్వరలో రాబోతోంది. స్పెల్లింగ్ తప్పు రాసిన ప్రతిసారి వైబ్రేట్ చెందే లెర్న్‌స్టిఫ్ట్ స్మార్ట్ పెన్నును జర్మనీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సాధారణ ఇంకుతో పనిచేసే ఈ పెన్నులో ప్రత్యేక సెన్సర్, ఓ చిన్న బ్యాటరీ, ఓ వైఫై చిప్ ఉంటాయి. స్పెల్లింగ్‌ను తప్పుగా రాసినప్పుడు లెర్న్‌స్టిఫ్ట్ పెన్నులో ఉన్న సెన్సర్ కారణంగా అది వైబ్రేట్ చెందుతుంది. వెంటనే మనం రాసిన స్పెల్లింగ్‌ను సరిదిద్దేసుకోవచ్చు.

No comments:

Post a Comment