Monday, July 1, 2013

మింగ గలిగే కంప్యూటర్లు....న్యూస్ మరియూ ఫోటోలు

ఇది చూడటానికి మామూలు మందు గుళికలాగా ఉంటుంది. ఇంకొద్ది రోజులలో వీటిని డాక్టర్లు మందుల చీటీలలో రాస్తారు. ఇవి రాత్రిపూట రెండు గుళికలు వేసుకుని పడుకుంటే ప్రొద్దున్నే అవి ఆ డాక్టరుకు మీ ఆరొగ్య పరిస్తితి గురించి ఇ-మైల్ పంపుతుంది.
ఒక పక్క గూగుల్ కళ్ళద్దాల పై ప్రైవసీ గురించిన చర్చలు జరుగుతున్నా, శాస్త్రవేత్తలు మినిస్క్యూల్ సెన్సార్లతో(minuscule sensors) ఇంజెక్షన్ కంప్యూటర్లూ మరియూ గుళికలు తయారుచేసే తీవ్రతలో ఉన్నారు. ఇవి ఇంకా ప్రధాన జీవన స్రవంతి లోకి రాకపోయినా కొంతమంది వీటిని తమ ఆరోగ్య పరిస్తితుల విషయంకోసం వాడుతున్నారని చెబుతున్నారు. ఇందులో కొన్ని గుళికలు, ఇంజెక్షన్లూ డాటాల కోసం కాకుండా, తమ కార్ల తలుపులు, ఇంటి తలుపులూ మరియూ వారి పాస్ వర్డ్ లకు ఉపయోగిస్తున్నారట( అంటే: డాటా కోసం ఈ గుళికలు, లేక ఇంజేక్షన్లూ వేసుకున్న వారు, తాము వెళ్ళి నిలబడితేనే తలుపులు తెరుచుకుంటాయి లేక వారి కంప్యూటర్ర్ దగ్గర వారు కూర్చుంటేనే పాస్ వర్డ్ కమ్యూనికేట్ అయ్యి వారి కంప్యూటర్లు, ఇ-మైల్స్, నెట్-బాంకింగ్ ఓపెన్ అవుతాయి).
దీనిని ఒక మైక్రోస్కోపిక్ రోబోట్ అని చెప్పవచ్చు. ఈ గుళికలు మింగినవారిలో, ఈ గుళికలు కడుపులోని పేగులలో ఉండి అక్కడి నుండి సమాచారం ను అందచేస్తుంది.
కాలిఫోర్నియాలో ఉన్న Proteus Digital Health అనే చిన్న కంపనీ తయారుచేస్తున్న ఇంటువంటి గుళికలకు బ్యాటరీలతొ పనిలేదుట. ఆ గుళికలపైన ఉన్న మెగ్నీషియం మరియూ కాపార్ వలన కడుపులో ఉన్న ఆసిడ్ కరెంటుగా మారి గుళిక పనిచేస్తుందట. ఈ గుళికల వలన మానవులకు ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

No comments:

Post a Comment