Saturday, June 15, 2013

గూగల్ వినూత్న ప్రయోగం .. బెలూన్ల ద్వారా అందరికీ ఇంటర్నెట్....ఫోటోలూ మరియూ వీడియోలు

నిత్యం కొత్త ఆలోచనలకు ప్రాధాన్యతను కల్పించే ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇంటర్నెట్ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను ఆకాశంలోకి పంపించి వాటిద్వారా భూమ్మీద ఉన్న మారుమూల ప్రాంతాలకు సైతం అంతర్జాలం సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ సర్వీసులు ఆప్టికల్ ఫైబర్ తీగల ద్వారా అందుతున్నాయి. ఈ వ్యవహారం ఖరీదైనదిగా ఉండటంతో అనేక దేశాల్లో ఇంటర్నెట్ అందని ద్రాక్షగానే ఉంది. ప్రపంచ జనాభాలో 220 కోట్ల మందికి అందుబాటులో ఉండగా.. 480 కోట్ల మందకి దూరంగానే ఉంది. ఈ అంతరాన్ని తొలగించే లక్ష్యంతో గూగుల్ ఈ ప్రాజెక్టు పై పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది. 18 నెలల క్రితం గూగుల్ ‘ప్రాజెక్ట్ లూన్' పేరుతో బెలూన్ ఇంటర్నెట్ ప్రయోగాన్ని అత్యంత రహస్యంగా చేపట్టంది. ఈ వివరాలను గూగుల్ శనివారం వెల్లడించింది. భూమికి 12 మైళ్ల ఎత్తులోకి కొన్ని హీలియం బెలూన్లను పంపించింది. వీటిని నుంచి దాదాపు ఇప్పటికే 50 కుటుంబాలు తమ ఇళ్లలోని కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే ఇంటర్నెట్ మరింత చవకగా మారి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని గూగుల్ ధృడ నిశ్చయంతో ఉంది.

ప్రపంచం నలుమూలలా కుగ్రామాలకు సైతం 3జీ స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించే లక్ష్యంతో గూగుల్ కంపెనీ ఇటీవల ఆకాశంలోకి పంపిన హీలియం బెలూన్ ఇది. భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే బెలూన్లలోని ట్రాన్స్మీటర్లు.. వినియోగదారుల ఇళ్ల మీద అమర్చిన బాస్కెట్బాల్ సైజు రీసీవర్లకు సిగ్నల్స్ను చేరవేస్తాయి. ఈ ప్రయోగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని గూగుల్ ప్రకటించింది. న్యూజిలాండ్లో ఓ ఇంటికి అమర్చిన గూగుల్ రిసీవర్ను చిత్రంలో చూడొచ్చు.


No comments:

Post a Comment