Saturday, June 1, 2013

సూక్ష్మాకార టర్కీ దేశం....ఫోటోలు మరియూ వీడియో

టర్కీ : అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీ (జమ్ హూరియత్-ఎ-తుర్కీ) అని వ్యవహరిస్తారు. ఇది ఒక యూరేషియా దేశం. అనగా ఇటు ఆసియా లోనూ అటు ఐరోపా లోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా మరియు రుమేలియా (బాల్కన్ ప్రాంతం) లోనూ వ్యాపించి యున్నది. టర్కీ కు 8 పొరుగుదేశాల సరిహద్దులు గలవు. ఈశాన్యంలో బల్గేరియా, పశ్చిమాన గ్రీసు, వాయువ్యంలో జార్జియా, తూర్పున ఆర్మీనియా, అజర్బైజాన్, మరియు ఇరాన్, ఆగ్నేయంలో ఇరాక్ మరియు సిరియా లు గలవు. దక్షిణాన మధ్యధరా సముద్రము మరియు సైప్రస్, ఏగియన్ సముద్రము మరియు ద్వీపసమూహములు పశ్చిమాన మరియు ఉత్తరాన నల్ల సముద్రము గలవు. రెండు ఖండాలైన ఆసియా మరియు యూరప్ ల మధ్య ఉండడము వలన ఈ దేశపు సభ్యత తూర్పు పడమరల కలయిక అయినది.

టర్కీ దేశం చాలా అందమైన దేశముగా ప్రసిద్దిచెందినది. ఈ దేశాన్ని పూర్తిగా చూడాలంటే కనీసం 3 నెలలు పడుతుందట. అందువలన టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నగరంలో ఈ సూక్ష్మాకార టర్కీ ని నిర్మించేరు. పర్యాటకులు ఈ సూక్ష్మాకార టర్కీ దేశం ను చూస్తే టర్కీ దేశాన్ని పూర్తిగా చూసినట్లే.


No comments:

Post a Comment