ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును
NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Monday, June 3, 2013
అత్యంత ఎత్తైన/ఎత్తుకు వెళ్లే కేబుల్ కార్....ఫోటోలు
Aiguille du Midi(Needle of the Mid-day): ఇది అనే కొండ ఫ్రాన్స్ దేశంలోనే అతి ఎత్తైన కొండ. 3,842 మీటర్ల ఎత్తు కలిగిన ఈ కొండపై పరిశోధనల నిమిత్తం 1905 లోనే ఒక కేంద్రం కట్టేరు. కానీ అక్కడికి వెళ్లడం చాలా కష్టమైన పనిగా ఉండటంతో దానిని ఆ సంవత్సరమే మూసేసేరు. కానీ 1924 లో ఫ్రాన్స్ రైల్వే దానిని ఒక పర్యాటక ప్రదేశంగా చేసి ఆ రోజుల్లోనే ఒక కేబుల్ కార్ వేసేరు. కానీ ఆ కేబుల్ కార్ ను సగం ఎత్తువరకే తీసుకు వెళ్లగలిగేరు. పర్యాటకులు అక్కడి నుండి నడిచి వెళ్లవలసి వచ్చేది. అందువలన 1951 లో దానిని మూసేసేరు. మళ్ళీ 1991 లో ఒక ఇంజనీర్ ఒక ప్రాజెక్ట్ తో ఒక కేబుల్ కారును పరిశోధనా కేంద్రం వరకు తీసుకు వెళ్లగలిగేడు. ఇప్పుడు(ఎప్పుడూ)అక్కడ ఎటువంటి పరిశోధనలు జరపలేదు. కానీ అది ఒక పర్యాటక ప్రదేశంగా మిగిలిపోయింది. అక్కడికి పర్యాటకులను తీసుకువెళ్లే కేబుల్ కార్ మాత్రం అత్యంత ఎత్తైన కేబుల్ కార్ గా ప్రసిద్ది చెందింది.
wowwwwwwwwwwwwww
ReplyDeletewatch Telugu news, dramas and your favorite Tv Channels ONline on Internet Live at
http://alltvchannels.net/telugu-channels