Sunday, June 23, 2013

మాంచెస్టార్(లండన్) మ్యూజియంలోని ఈ విగ్రహం తిరుగుతోంది!....ఫోటోలు మరియూ వీడియో

ఈ క్రింది ఫోటోలలో మీరు చూస్తున్న విగ్రహం ఈజిప్ట్ దేశానికి చెందినది. ఇది 4000 సంవత్సరాల క్రితం నాటి విగ్రహమట. 10 అంగుళాల ఎత్తుగల ఈ విగ్రహం గత 80 ఏళ్ళుగా మాంచెస్టార్ మ్యూజియంలో ఉన్నది. కొన్ని వారాల క్రిందట మ్యూజియం అధికారులు ఈ విగ్రహం వుంచిన దిశ నుండి మారినట్లు గ్రహించి, అనుమానంతో సీక్రెట్ వీడియో కెమెరాలతో పర్యవేక్షించేరు. అప్పుడు ఈ విగ్రహం చాలా నెమ్మదిగా తిరుగుతున్నట్లు వీడియోలో నమోదైంది. ఈ విగ్రహం పగటివేళ మాత్రమే తిరుగుతున్నట్ట్లు తేలింది. ఈ విషయాన్ని అక్కడి లోకల్ న్యూస్ పేపర్ మాంచెస్టార్ ఈవెనింగ్ న్యూస్ వెళ్ళడించింది.

No comments:

Post a Comment