Monday, June 17, 2013

ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న వరద భీభత్సం! వరద నీటిలో కొట్టుకుపోతున్న గుడి....వీడియో

ఉత్తరాఖండ్లో వరద భీభత్స పరిస్థితి ఇంకా అదుపులోకి రానట్టు తెలుస్తోంది. భారీ వర్షాలకు దెబ్బ తిన్న సమాచార వ్యవస్థ మెరుగుపడలేదు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారం ఇతరత్రా సదుపాయాలు ఇంకా అందనట్టు తెలుస్తోంది. దాంతో ఆహార పదార్ధాలు అందకపోవడంతో యాత్రికులు ఆకలితో అలమటిస్తున్నారు. కొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారు.

అలక్నంద నదిలో వాహనాలు కొట్టుకుపోయినట్టు సమాచారం. భారీగా వరద ముప్పు ఉందన్న సమాచారంతో మందాకిని నది తీరం వెంబడి ప్రజలను అధికారులు ఖాళీచేయించారు. హరిద్వార్లో గంగానది ప్రమాదస్థాయిలో సాధారణం కంటే 2 మీటర్ల ఎత్తున ప్రవహిస్తోంది. హరిద్వార్ - ఢిల్లీల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

No comments:

Post a Comment