Monday, May 20, 2013

నిన్న ఒక్లహామాను కుదిపేసిన టోర్నడోలు....ఫోటోలు మరియూ వీడియో

మే 20 న అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో నాలుగు టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. వీటి ప్రభావానికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు భయభ్రాంతులకులోనై సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. టోర్నడోల విధ్వంసానికి 51మంది మరణించారని, పలువురు గాయపడ్డారని అధికారవర్గాలు వెల్లడించాయి. టెక్సాస్‌నుంచి మిన్నెసొ టా వైపు పయనిస్తున్న తుఫాను ప్రభావం ఒక్లహామా, కన్సాస్‌పై తీవ్రంగా ఉంది. టోర్నడోలు విరుచుకుపడడంతో షావన్‌నీ పట్టణంలోని వీధులు, ఇళ్లు దుమ్ము, ధూళి, బురదతో నిండిపోయాయి. రహదారులపై వాహనాలు తిరగబడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది. కన్సాస్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. టోర్నడోల ప్రభావం పూర్తిగా తొలిగిపోలేదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.


No comments:

Post a Comment