Wednesday, May 29, 2013

ఫ్లోరీడా బీచ్ లో కనబడిన చనిపోయిన జల కన్య?....వీడియో

జల కన్య లేక మత్స్య కన్య ప్రపంచంలోని అనేక సంస్కృతులకు చెందిన పురాణాల్లో వర్ణించబడిన జీవులు. అనగా నీటిలో నివసించే ఒక రకమైన జీవులు. ఇవి సగం మానవ రూపాన్ని సగం మత్స్య రూపాన్ని కలిగి ఉంటాయి, అనగా తలనుండి నడుము వరకు మనిషి రూపాన్ని నడుము నుండి చేప వలె తోక ఉంటుంది. వీటిలో జాతి విభేదము కూడా ఉంటుంది. సాధారణంగా ఇటువంటి జలచరాలను స్త్రీరూపంలోనే చిత్రిస్తారు. 2004 లో వచ్చిన సునామీలో అట్టడు సముద్ర గర్భంలోదాగి ఉన్న చేపలలో కొన్ని వాటికి మత్స్య కన్యల వలెనె రూపం ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది.[ఆధారం కోరబడినది] ఇటువంటి జీవులు సముద్ర గర్భంలో మాత్రమే తిరుగాడుతూ ఉంటాయని ఊహ. వాస్తవానికి జలకన్యలు పురాణ సంబంధమైన జీవులు మాత్రమే. సాహస వీరుడు-సాగరకన్య అను తెలుగు సినిమాలో శిల్పా కుంద్రా జలకన్యగా నటించింది.

కంబోడియా మరియు థాయిలాండ్ రామాయణాల్లో సువన్నమచ్చ (బంగారు మత్స్య కన్య) అనే రావణుని కూతురు పాత్ర కనిపిస్తుంది. ఈ మత్స్య రాకుమారి హనుమంతుడు లంకకు వారధి కట్టకుండా ఆపేందుకు విఫలయత్నం చేస్తుంది కానీ చివరికి హనుమంతుని ప్రేమలో పడుతుంది. థాయ్ జానపదంలో ఈ పాత్ర చాలా ప్రాచుర్యం పొందింది.

1493లో అమెరికా ఖండపు తీరంలో సముద్రంపై ప్రయాణిస్తుండగా, క్రిస్టఫర్ కొలంబస్ సముద్రం నుండి మూడు స్త్రీరూపం కలిగిన జీవులు సముద్రం నుండి పైకి ఎగసిపడ్డాయని, కాకపోతే అవి అందరూ వర్ణించినంత అందంగా ఏమీలేవని నివేదించాడు.

3 comments:


  1. అయ్య బాబోయ్,

    ఇది నిజమైన వీడియో నే అంటారా ! అచ్చు మనుషుల ముఖం పోలి ఉంది అండి ఆ సొ కాల్డ్ జలచరం ! నో మార్ఫింగ్ హోపే ఫుల్లీ !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi gaariki,

      నిజమో, కాదో నాకూ తెలియదు. కానీ నిజమని అంటున్నారు. ఈ రోజు నేను ఒక కొత్త వీడియో అందించేను. జల కన్యలు నిజమని, ఇంకా ఉన్నాయని ఆ వీడియో మూలం చెబుతున్నారు. అందులోనూ ఆ వీడియో అనిమల ప్లానెట్ వారు అందించింది. ఇది కూడా ఎంతవరకు నిజమో నాకూ తెలియదు.

      మీకోసం

      Delete
  2. this is really silly one.....this is a plastic piece
    How can a life material doesn't decompose ....they desgined a piece which looks like left there for long and survived the weather but forgot the weather impact and ware off details.

    ReplyDelete