Tuesday, May 21, 2013

కొత్త శకం మొదలయ్యింది:గూగుల్ గ్లాస్(కళ్ళద్దాలు)వేసుకోవడం ప్రారంభించేరు....ఫోటోలు

5 మెగాపిక్సెల్ కెమెరా.. అది తీసే వీడియో రిజల్యూషన్ 720 పిక్సెల్స్.. 16 జీబీ స్టోరేజీ.. ఇంటర్నెట్ కనెక్షన్తో కళ్లముందు ప్రపంచాన్ని నిలిపే గూగుల్ గ్లాస్ స్పెసిఫికేషన్లు ఇవి! అంతేనా.. దీని బ్యాటరీ అంత తొందరగా అయిపోదు. ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు రోజంతా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రియులంతా ఎదురుచూస్తున్న ఈ వివరాలను గూగుల్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ కళ్లద్దాలను జస్ట్ అలా మన తలకు తగిలించుకుంటే చాలు.. నోటి మాటతో కావాల్సిన సమాచారాన్ని పొందచ్చు. ఆడియో వినొచ్చు. వీడియో తీయొచ్చు. సినిమాలు చూడొచ్చు. ఇంటర్నెట్లోకెళ్లి ఇష్టమొచ్చిన వెబ్పేజీలు తెరవొచ్చు.


2 comments:

  1. అన్నీ కంటి చూపుతో అంటే, వీటి మీద పేటెంట్ హక్కులు బాలయ్య బాబువా?

    ReplyDelete
  2. collection చాలా బావుందండి , మరి మనకు అందుబాటు లోకి వస్తాయో కదా ???

    http://www.techwaves4u.blogspot.in/
    తెలుగు లో టెక్నికల్

    ReplyDelete