Friday, May 17, 2013

ఖైదుచేయబడ్డ జంతువులు....ఫోటోలు

ఓస్కార్ అని పిలువబడే పిల్లి ఈ పిల్లిని స్వీడన్ పోలీసులు అరెస్టు చేసేరు. కారణం ఈ పిల్లి పక్కింటి పిల్లులను బెదరగొట్టి ఆ పిల్లులకు పెట్టిన ఆహారాన్ని దౌర్జన్యంగా తినడంవలన. ఈ విషయాన్ని బెదరగోట్టబడిన పిల్లులను పెంచుతున్న యజమాని పోలీసులకు తెలిపేరు. ఓస్కార్ పిల్లిని పెంచుతున్న యజమాని ఖైదుచేయబడ్డ తన పిల్లిని బైలుమీద తీసుకురావడానికి నిరాకరించడంతో పిల్లికి మరణ శిక్ష విధించినట్లు చెబుతున్నారు.

భోలా అనే ఏనుగు భారతదేశంలో రోడ్డును దాటుతూ ఒక వాహనాన్ని ఢీ కొన్నది. వాహనంలోని వారు గాయపడ్డారు. ఏనుగు ఖైదు చేయబడింది. కోర్టు ఏనుగును కస్టడీలో ఉంచింది. ఏనుగు యజమాని రానందున కొర్టు ఏనుగును అటవీ అధికారులకు అప్పగించేరు.

బాబీ అనే భారతీయ కోతి భారత-పాకిస్తాన్ సరిహద్దును దాటిందని ఖైదుచేయబడింది. కొన్ని రోజుల కస్టడీ తరువాత జూ అధికారులకు అప్పగించేరు.

గూఢచారి పావురం పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి వచ్చిన ఈ పావురానికి, కాల్లకు రింగులూ మరియూ పాకిస్తాన్ ఫోన్ నంబర్ పావురంపై ముద్రించబడి ఉన్నది. అందుకని పాకిస్తాన్ గూఢచరి గా నిర్ణయించి ఖైదు చేసి, కస్టడీలో ఉంచేరు. సీనియర్ అధికారులకు రోజుకు మూడు సార్లు పావురం గురించి పావురానికి కాపలా ఉన్న పోలీసులు తెలియజేయాలి. పావురాన్ని చూడటానికి ఎవరినీ అనుమతించలేదు. కొన్నిరోజుల తరువాత పావురం కనిపించలేదు. ఏమైందనే విషయం అధికారులు తెలుపలేదు.

కిల్లర్ ఆవు 2005 లో నైజీరియా దేశంలోని లావోస్ నగరంలో ఖైదుచేయబడింది. కారణం బస్సు ఆపి మూత్ర విసర్జన కోసం రోడ్డు పక్కకు వెళ్ళిన బస్సు డ్రైవర్ను కొమ్ములతో పొడిచి చంపింది. అడ్డుకోబోయిన ప్యాసింజర్లలో ఒకరిని హతమార్చింది. దాన్ని అక్కడే చంపేయమని ప్రజలు గోలచేసేరు. కానీ పోలీసు అధికారులు దానిని ఖైదుచేసి కస్టడీలో ఉంచేరు.

మూకీ అనే కోతి ఒక మనిషిని కరిచిందని ఫ్లోరీడా పోలీసులు ఈ కోతిని ఖైదుచేసేరు. కోతి యజమాని, కోతిని ముట్టుకోవద్దని, జంతువుల గుణాలు ఎప్పుడు మారుతాయో తెలియదని చెప్పినా ఆ మనిషి ఆ కోతిని ఎత్తుకుని ముద్దులాడేడు. ఆ కోతి అతన్ని కరిచింది. మొదట 30 రోజుల కస్టడీ అని చెప్పి కష్టడీలో ఉంచేరు. తరువాత ఆ కోతికి రాబీస్ వ్యాధి ఉందేమోనన్న అనుమానంతో దాని కస్టడీని పెంచేరు. యజమాని అడిగిన బైలును తిరస్కరించేరు. ఆ కోతి తన 20 వ పుట్టిన రోజును కస్టడీలోనే చేసుకుందట.

స్మగుల్లింగ్ పిల్లి బ్రెజిల్ దేశ జైలు అధికారులు ఈ పిల్లిని ఖైదు చేసేరు. ఈ పిల్లి అప్పుడప్పుడూ జైలులోకి రావడం పోవడం చేస్తోందట. ఒక రోజు ఒక జైలు అధికారి ఆ పిల్లికి ఏదో కట్టి ఉండటం చూసేడట. పిల్లిని పట్తుకుని చూస్తే ఆ పిల్లి నడుముకు ఒక సెల్ ఫోన్ మరియూ కొన్ని డ్రగ్స్ కట్టి ఉన్నాయట.జైలులో ఉన్న ఖైదీలే ఈ పిల్లిని పెంచి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారని, ఈ కేసులో 263 ఖైదీలను అనుమానితులుగా గుర్తించేరు. అనుమానితులలో పిల్లి ఉన్నదా, లేదా అనే విషయం తెలుపలేదట.

లారెంజో అనే చిలుక ఈ చిలుక డ్రగ్స్ స్మగుల్లింగ్ గ్యాంగ్ మెంబరట. పోలీసులు రైడు కు వస్తున్నప్పుడు "పోలీసులు,పోలీసులు" అని అరచి స్మగులర్స్ ను హెచ్చరిస్తుందట. రెండు, మూడు సార్ల రైడులో ఎవరూ దొరకకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు 4 వ సారి ఈ చిలుకను గమనించేరు. వెంటనే దానిని రహస్యంగా ఖైదుచేసేరు. ఆ తరువాత వెంటనే జరిపిన రైడులో చాలమందిని పట్టుకోవడమే కాకుండా, 200 తుపాకులూ, అత్యధిక విలువగల డ్రగ్స్ నూ చేజిక్కించుకున్నారు.

గోషా అనే కోతి రష్యాలో ఒక ధనవంతుని ఇంట్లో పెంచబడిన ఈ కోతిని, ఆ కోతి చేసే అల్లరి భరించలేక ఆ కోతిని వదిలేసేరు. ఆ తరువాత ఆ కోతి రోడ్ల మీద తిరుగుతూ ఇళ్ళులేని వారితో స్నేహం చేసేది. అలా స్నేహం చేసిన వారిలో ఒకరు ఆ కోతిని తాను ఉంటున్న చోటుకు తీసుకు వెళ్లేరు. రష్యాలో ఇళ్ళు లేని వారు ఉండకూడదనే చట్టం ఉన్నది. అలా ఇళ్ళు లేక ఎక్కడబడితే అక్కడ నివసించేవారిని ఖైదుచేస్తారు. ఆలా ఒక సారి ఇళ్ళలో నివసించనవారిని ఖైదుచేసే పనులలో ఉన్న పోలీసులకు ఒక కుటుంభంతో ఉంటున్న ఈ కోతిని కూడా ఖైదుచేసేరు. ఆ తరువాత ఆ కోతిని ఒక జూ కు పంపించేరు.

మ్యాజిక్ మేక దీనికి పేరులేదు. 2009 లో దారికాచి కారులో వెడుతున్న వారిని దోచుకునే ఒక దొంగల ముఠాను పోలీసులు ఎదుర్కొన్నారు. ముఠాలో అందరినీ పట్టుకున్నారు. ఒకరు మాత్రం తప్పించుకున్ని పారిపోతూంటే వెంబడించేరు. చివరికి ఆ పరిగెత్తిన మనిషి ఆగిపోవడం, మేకగా మారడం గమనించిన పోలీసులు ఆ మేకను ఖైదుచేసేరు. ఆ తరువాత పోలీసులు ఆ మేకను వేలం పాటలో అమ్మేసేరు. ఆ మేకను 100 రూపాయలకు ఎవరో కొనుకున్నారు.

1 comment:

  1. చివరికి ఆ పరిగెత్తిన మనిషి ఆగిపోవడం, మేకగా మారడం గమనించిన పోలీసులు ఆ మేకను ఖైదుచేసేరు:-)

    ReplyDelete