Wednesday, May 22, 2013

20 సెకండ్ల మొబైల్ రీచార్జర్: మొబైల్ ఫోన్ చరిత్రను మార్చిన ఇండో అమెరికన్ యువతి.....ఫోటోలు

కేవలం 20 సెకెండ్లలో మీ సెల్ ఫోన్‌ను ఛార్జ్ చేసే.... కొత్త పరికరం రూపు దిద్దుకుంది.కాలిఫోర్నియాకు చెందిన ఇండో అమెరికన్ ఇషా కరే ఎలక్ట్రానిక్ రంగంలో కీలక ఆవిష్కరణ చేసింది. కేవలం 20 సెకన్లలో సెల్‌ఫోన్‌ను చార్జ్ చేసే సూపర్ కెపాసిటర్‌ను అభివృద్ధి పరిచింది. అంతేకాదు, ప్రఖ్యాత ఇంటెల్ సంస్థ నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డునూ సొంతం చేసుకుంది. అవార్డుతోపాటూ రూ.25 లక్ష్లు బహుమతి కూడా పొందింది.

గిజ్మోగా పిలుస్తున్న ఈ పరికరాన్ని మొబైల్ బ్యాటరీలో అమర్చవచ్చు. దీంతో బ్యాటరీలో ఛార్జింగ్ ఎక్కువ టైం ఉంటుంది. గిజ్మో పరికరం జీవితకాలం సుమారు పది వేల చార్జింగ్ సైకిల్స్. అంటే దాన్ని పది వేల సార్లు చార్జింగ్ చేసుకుని వినియోగించుకోవచ్చు.

సాధారణ బ్యాటరీల జీవితకాలం....... వెయ్యి చార్జింగ్ సైకిల్స్ మాత్రమే. ఆ తర్వాత వాటి శక్తి క్రమంగా తగ్గిపోతుంది.కొత్త బ్యాటరీ కొనుక్కోవాలి.నానోకెమిస్ట్రీ టెక్నాలజీ ఆధారంగా ........ప్రవాస భారతీయ విద్యార్థిని ఇషా గిజ్మోని రూపొందించింది.


No comments:

Post a Comment