Tuesday, April 9, 2013

ఏ క్షణమైనా అణు యుద్ధం: ఉత్తర కొరియా బెదిరింపు నిజమైనదేనా?... ఇంతకు ముందు బెదిరింపుల చరిత్ర.....ఫోటోలు

ఏ క్షణమైనా అణు యుద్ధం ,ఆ దాడిలో బాధితులు కావొద్దు:....దక్షిణ కొరియాలోని విదేశీయులకు నిన్న ఉత్తరకొరియా హెచ్చరిక జారీచేసింది.

అమ్ములపొదిలోని అణ్వాస్త్రాలను అమెరికా, దక్షిణ కొరియాలపై మోహరించినట్టు చెప్పుకున్న ఉత్తర కొరియా.. మరో అడుగు ముందుకేసింది. దక్షిణ కొరియాలో ఉన్న విదేశీయులంతా ఆ దేశం వదిలిపెట్టిపోవాలని తాజాగా హెచ్చరించింది. కొరియా ద్వీపకల్పంలో త్వరలో అణు యుద్ధం జరగనున్నందున సియోల్ తదితర నగరాలు, ప్రాంతాల్లో ఉంటున్న పా శ్చాత్య దేశీయులంతా స్వస్థలాలకు వెళ్లిపోవాలని కోరింది.

రాయబారులు, పర్యాటకులు, బయట నుంచి వచ్చి ఉద్యోగాలు, పనులు చేసుకుంటున్నవారంతా తక్షణం సియోల్ను ఖాళీచేయాలి. కొరియా దీపకల్పంలో అణుయుద్ధం అప్పుడా ఇప్పడా అన్నట్టు కమ్ముకొస్తున్నది. ఈ పరిస్థితుల్లో విదేశీయులు బాధితులుగా మారడం మాకు ఇష్టం లేదు'' అని ఉత్తర కొరియా ప్రభుత్వం అధికార ప్రకటనలో హెచ్చరించింది.

నిజానికి.. వారం రోజుల క్రిత మే ఇలాంటి హెచ్చరికలనే తన దేశంలోని విదేశీ రాయబారులకు ఉత్తర కొరియా చేసింది. అంతేకాదు.. 10 వ తేదీ తరువాత యుద్ధం జరిగితే తమ బాధ్యత ఉండదని కూడా హెచ్చరించింది. మరోసారి అలాంటి హెచ్చరికలనే ఉత్తర కొరియా చేయడం రక్షణ వర్గాల్లో చర్చనీయాంశంగామారింది.

చెబుతున్నంత స్థాయిలో ఉత్తర కొరియాలో అణ్వాయుధ కార్యక్రమం జరగడం లేదన్న అభిప్రాయాన్ని పలుదేశాలు వ్యక్తం చేస్తున్నాయి. కారణం, ఇంతకు ముందు ఉత్తర కొరియా ఇలాంటి యుద్ద ప్రకటనలను విడుదలచేసింది. కానీ ఏ ఒక్క సారి యుద్దాలకు పూనుకోలేదు. ఎందుకంటే వారి దగ్గర యుద్దానికి సరిపడా సామగ్రిలేదని చెబుతున్నారు.


1 comment: