Saturday, April 6, 2013

ఎప్పుడూ తెలుపు రంగుతోనే ఉండే ఇళ్ళు(గ్రామాలు)....ఫోటోలు

ఈ మధ్య మనం ఇళ్ళకు గాఢమైనరంగులు వేయడం చూస్తున్నము. పచ్చ రంగు, ఎరుపు రంగు, నీలం రంగు...ఇలా వివిధ రంగుల పెయింటింగులతొ రంగులు వేస్తున్నారు. దీనికి కారణం వాస్తు అని గూడా చెబుతున్నారు....కానీ స్పైన్ దేశంలోని కొన్ని గ్రామాలలో ఇళ్ళకు తెలుపు రంగు మాత్రమే వేస్తారట. ఇలా తెలుపు రంగు మాత్రమే వేయడం అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన అలవాటు కాదు. 9 వ శతాబ్ధము నుండి వస్తున్న ఆచారమని చెబుతున్నారు. కానీ 1920 తరువాత తెలుపు రంగు సంవత్సరానికి ఒకసారో, రెండు సంవత్సరాలకు ఒకసారో వేయడం మాత్రం అందరికీ తెలిసిందట. కారణాలకోసం తెలుసుకోవడానికి ప్రయత్నించేరుగానీ, నిజమైన కారణం మాత్రం తెలుసుకోలేకపోయేరు. అయితే దీనికి రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి తెల్ల రంగు వెయడం వలన బాక్టీరియాలు గోడలకు అతుక్కోవట, రెండవది ఆ గ్రామములోని ప్రజలు భేదాలు లేకుండా కలిసే ఉంటారనే నమ్మకం.....ఏది ఏమైనా తెలుపు శాంతికి చిహ్నం మరియూ కళ్ళకు విందూ కలిగిస్తుంది.


No comments:

Post a Comment