Tuesday, April 2, 2013

‘వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్’ నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది.....ఫోటోలు

సెప్టెంబర్ 11, 2001న వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై టెర్రరిస్ట్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. సుమారు 3 వేల మందిని బలిగొన్న ఈ కిరాతక చర్యలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ధ్వంసం అయిన సంగతి తెలిసిందే. తరువాత అక్కడ ఉన్న నిర్మాణాన్ని పూర్తిగా తొలగించి... మళ్లీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణాన్ని చేపట్టింది అమెరికా ప్రభుత్వం. ఆ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన ఒక భవన సముదాయమే ఈ ‘వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్’. ఇక్కడ 16 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం ఏడు వరల్డ్ ట్రేడ్ సెంటర్లు నిర్మాణం అవుతున్నాయి. అందులో మొదటిదే వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ బహుళ అంతస్తుల భవనం... ఎత్తులో ప్రపంచంలోనే మూడవ స్థానాన్ని ఆక్రమించింది.


No comments:

Post a Comment