Tuesday, April 2, 2013

సముద్రంలో అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగ కేంద్రం.....ఫోటోలు

ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి భూమిమీద ఎన్నో అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు ఉన్నాయని మనకందరికీ తెలుసు. అలా మనకు తెలిసున్న వాటిలో మనదేశంలో ఉన్న శ్రీహరి కోట మరియూ అమెరికాలోని నాసా ప్రయోగ కేంద్రం మనకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. మరి సముద్రంలో ఒక అంతరిక్ష కేంద్రం ఉన్నదని చాలామందికి తెలిసుండకపోవచ్చు.కానీ అలాంటిది ఒకటున్నది.

సముద్రంలోని ఆ అంతరిక్ష ప్రయోగ కేంద్రం పేరు "సీ లాంచ్". రెండు అతిపెద్ద ఓడలూ, నాసా అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఉన్నట్లే ఒక మిషన్ కంట్రోల్ మరియూ లాంచ్ ప్యాడ్ సముద్రంలో తేలుతూ ఉంటుంది. ఇక్కడి నుండి అంతరిక్షానికి ఎన్నో ఉపగ్రహాలను పంపేరు.

అత్యంత ఖరీదైన ఈ సీ లాంచ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ను 1995 లో నిర్మించేరు. ఇది ఒక సహవ్యవస్థ సంస్థ. నార్వే, రష్యా, యూక్రైన్ మరియూ అమెరికా దేశాలు కలిసి నిర్మించుకున్న ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రమును బోయింగ్ సంస్థ నిర్వహన చేస్తుంది. ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రమును రష్యా వారు నడుపుతారు.

ఈ మొబైల్ సముద్ర ప్లాట్ ఫారం నుండి ఇంతవరకు 31 ఉపగ్రహాలను తాయారుచేసి, ఆ ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించేరు. ఇందులో 4 మాత్రం విజయవంతమవలేదు.

భూమిమీద ఎన్నో ఉపగ్రహ ప్రయోగ కేంద్రాలు ఉన్నప్పుడు సముద్రంలో ఒకటెందుకని అందరికీ అనిపించవచ్చు. ఈ మొబైల్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ను భూమధ్యరేఖకు దగ్గరగా తీసుకువెళ్ళి ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. భూమధ్యరేఖ దగ్గర భూమి చూట్టే వేగం ఎక్కువగా ఉంటుంది(ఉదాహరణకు: కెనడీ స్పేస్ సెంటర్ దగ్గర భూమి చుట్టే వేగం గంటకు 1,470.23 కి.మీ అయితే భూమధ్యరేఖ దగ్గర భూమి చూట్టే వేగం గంటకు 1,674 కి.మీ ఉంటుంది. అంటే గంటకు 200 కీ.మీ ఎక్కువ). దీని వలన ఉపగ్రహం పయనించే దారిని మార్పు చేయవలసిన అతిపెద్ద పని తగ్గుతుంది.


No comments:

Post a Comment