Monday, April 1, 2013

మధురై మీనాక్షి ఆలయ దేవాలయ గోపురాల పై చెక్కిన శిల్పాల మిరమిట్లు….ఇంత దగ్గరగా ఎప్పుడైనా చూసేరా?....ఫోటోలు

మధురై పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది మీనాక్షి ఆలయం. తమిళనాడులోనే కాదు..యావత్ భారతంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకున్న ఈ దేవాలయం... తమిళనాట వందలాది ఆలయాలున్నా..మధురైలోని మీనాక్షి దేవాలయం ప్రత్యేకతే వేరు.

1600 సంవత్సరంలో పాండ్యరాజైన కులశేఖర పాండ్య ఈ అద్భుత నిర్మాణాన్ని నిర్మించారని చెబుతున్నారు చరిత్ర కారులు. ఇందులో కొలువై ఉంది శివపార్వతులే అయినా వాళ్లను వేరే పేర్లతో పిలుస్తారు. పరమశివుడ్ని సుందరేశ్వరుడిగా.. పార్వతీదేవిని మీనాక్షిగా భక్తులు కొలుస్తారు. అద్భుత నిర్మాణ కౌశలంతో.. 45 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు.

గుడి చుట్టూ 14 గోపురాలున్నాయ్. ఇందులో రెండింటిని బంగారంతో తాపడం చేశారు. వీటిలో పెద్దదైన గోపురం ఎత్తు 170 అడుగులు కావడం గమనార్హం. దేవాలయంపై చెక్కిన శిల్పాలు, అక్కడి వాతావరణం, కోనేరు సహా ప్రతి ఒక్కటీ భక్తుల్ని ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తుతాయ్.


అలంకరణ నిమిత్తం ఇందులో ఒక మనిషి ఉన్నాడు...కనబడుతున్నాడా?


5 comments: