Monday, April 1, 2013

ఈ ముద్దాయి సంజై దత్ లాగా సెలెబ్రిటీ కాదు మరి....న్యూస్

ముంబై దాడులలో సంజై దత్ కు ఎటువంటి ప్రమేయమూ లేకపోయినా, ముంబై దాడులకు సంబంధం ఉన్నవారి దగ్గర నుండి తుపాకులు కొనుక్కుని తనింట్లో దాచుకున్న నేరం క్రింద కొన్ని రోజుల క్రితం అతనికి 5 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. వెంటనే సంజై దత్ కు ఎటువంటి టెర్రరిస్ట్ ఆక్టివిటీలలోనూ జోక్యం లేదని, అతనికి విధించిన జైలు శిక్షను రద్దుచేసి అతన్ని మన్నించి వదిలేయాలని ఎందరో ప్రముఖ సినీ నటులూ, రాజకీయవేత్తలూ సంజై దత్ కు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు.

తడా చట్టం క్రింద తుపాకులు దాచుకున్నవారు శిక్షార్హులు. భారత రాజ్యాంగ చట్టం ప్రకారం అది నేరం. ఇది తెలిసున్న ప్రముఖులు, పెద్ద మనుష్యులు సంజై దత్ కు మద్దతు పలికేలాగా అతనికి క్షమాబిక్ష ఇచ్చి, జైలు శిక్షను రద్దుచేయాలని అడగడం వింతగా ఉన్నది. సంజై దత్ తన నేరాన్ని కోర్టులో ఒప్పుకున్నాడు. మరి అటువంటప్పుడు అతనికి విధించిన జైలు శిక్షను దయతో కరుణించి, అతన్ని క్షమించి వదిలిపెట్టమని అడగడం వింతగానే ఉన్నది.

కానీ అర్జున్ శర్మ అనే 70 సంవత్సరాల వయసు గలిగిన వృద్ధాప్య వ్యక్తిని(తప్పే చేయని) వదిలిపెట్టమని అడుగుతూ ఏ ప్రముఖులూ ముందుకు రాలేదు. ఎందుకంటే అతను సినీ నటుడు కాదు, సెలెబ్రిటీ కాదు. సాదారణ రైతు.

అతని పొలంలో తుపాకులు దాచుకున్నాడని, అతన్ని కూడా తడా చట్టం క్రింద పోలీసులు అరెస్టు చేసేరు. అరెస్టు చేసినప్పుడు అతని వయస్సు 70 సంవత్సరాలు. అతని మీద 86 కేసులు నమోదుచేసేరు. "నాకేమీ తెలియదు. నా పొలంలో తుపాకులు ఎవరు దాచేరో కూడా తనకు తెలియదు" అని అతను ఎంత మొత్తుకున్నా ఎవరూ అతని మాటలు నమ్మలేదు. అతన్ని 4 సంవత్సరాలు బైలు ఇవ్వకుండా జైలులో ఉంచేరు. బైలు ఇచ్చిన తరువాత అతను తన ఊరికి తిరిగివెళ్ళినప్పుడు అక్కడ తన కుటుంభంలేదు.చిన్నాబిన్నమైపోయింది.

నిజానికి అతని పొలంలో తుపాకులు ఉంచింది ఉల్ఫా తీవ్రవాదులు. ఇది తెలుసుకున్న పోలీసులు అతని బైలును నిరాకరించలేదు. అయితే అతని మీద పెట్టిన మిగిలిన కేసులలోనూ అతను బైలు తెచ్చుకోవాలి. అందులోనూ ఒక్కొక్క కేసు ఒక్కొక్క కోర్టులో ఉన్నందువలన అతను వివిధ కోర్టులకు హాజరు కావలసి వున్నది. ఆరొగ్యం సరిగ్గాలేనందున కొన్ని కేసులకు హాజరుకాలేకపోయేడు. కోర్టులకు హాజరుకాలేదని అతన్ని మళ్ళీ పోలీసులు అరెస్టు చేసేరు. అతను ఏ తప్పూ చేయలేదని తెలిసిన పోలీసులు గానీ, ప్రముఖులుగానీ, రాజకీయవేత్తలుగానీ అతని మీద పెట్టిన కేసులను రద్దుచేయాలని ప్రకటనలు చేయలేదు.

20 కేసులలో అతను నిర్ధోషి అని కోర్టులు తీర్పునిచ్చేయి. మిగిలిన కేసులలో అతనికి బైలు మంజూరుచేసేరు. కానీ అతను నిర్దోషి అని తీర్పులు రావలసి ఉంది. బైలు వచ్చినవెంటనే అతని అన్నదమ్ములు వచ్చి అతన్ని తీసుకువెళ్ళేరు. మిగిలిన కేసులలో అతను నిర్ధోషి అని తీర్పులు వచ్చే సమయంలో అనారోగ్యం కారణంగా అతను చనిపోయేడు.

సినీ నటుడు కాదు కాబట్టి అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. అతని వెనుక ఎవరూ నిలబడలేదు. నేరం చేయకపోయినా జైలు శిక్ష అనుభవించేడు. కానీ నేరం చేసేనని స్వయంగా ఒప్పుకున్న సంజై దత్ ను క్షమించి వదిలేయమని ఎందరో ప్రముఖులూ, రాజకీయ నాయకులూ పోరాడుతున్నారు. ఇదేమి న్యాయం?

4 comments:

  1. పాపం ప్రముఖుడు కాడా? అంతే సంగతులు.

    All are equal before law.
    But some are more equal!

    అదీ సంగతి!

    ReplyDelete
  2. all those who are supporting sanju are balisina vaallu.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete