Monday, April 8, 2013

నిజాయతీ గల పోలీసులు లేక 6 నెలలుగా మూసేసున్న పోలీస్ ష్టేషన్!!!???.....న్యూస్

ఆశ్చర్యంగా ఉంది కదా...కానీ ఇది నిజం.

"ఇది మానవులుచేస్తున్న పనికాదు...దెయ్యం చేస్తున్న పని" అని చెబుతున్నారు.

జబల్పూర్ లోని షొయాపూర్ గ్రామంలో కొత్తగా కట్టబడ్డ ఒక పోలీస్ స్టేషన్ కధ. "నిజాయతీగా లేని ఏ ఒక్క పోలీసూ, ఈ పోలీసు ష్టేషన్లో ఒక్క రోజు గూడా గడపలేడు. ఎందుకంటే ఈ పోలీస్ స్టేషన్ కట్టడంలో ఉంటున్న దయ్యానికి నిజాయితీగా ఉండలేని పోలీసులంటే నచ్చదు" అని పండోలా గ్రామ సర్పంచ్ గోకుల్ సుమన్ చెబుతున్నారు.

"ఎంతోమంది పోలీసులు ఈ కొత్త పోలీస్ స్టెషన్ కు వచ్చేరు. వెంటనే తిరిగి వెళ్ళిపోయేరు. చివరిగా 6 నెలల క్రితం ఒక కొత్త పోలీసు ఆఫీసర్ వచ్చేడు. అతనుకూడా ఆ రోజే తిరిగి వెళ్ళిపోవడంతో ఈ పోలీసు స్టేషన్ను అప్పటి నుండి మూసే ఉంచేరు"

"పోలీసులకు ఆ గ్రామం చుట్టుపక్కలున్న గజ దొంగలూ, బడా నేరస్తులూ అంటే భయంలేదు. కానీ కనిపించని ఆ శక్తిని మాత్రం తట్టుకోలేకపోతున్నారు"

"ఈ పోలీసు స్టేషన్లో ఒక సబ్-ఇన్ స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, మరియూ 4 కానిస్టేబుల్స్ పనిచేస్తారు. కట్టిన(గత ఏడాది)రోజు నుండి స్టేషన్లో జరుగుతున్న విషయాల వలన ఇక్కడ పరిస్తితులు మారినై" మాజీ నగరపాలక అధినేత దౌలత్ రాం గుప్తా తెలిపేరు.

"ఒక రోజు సురేష్ షికావర్ అనే కానిస్టేబుల్ డ్యూటీలో ఉండగా అతని మీద ఏదో ఒక తెలియని శక్తి దాడిచేసింది. అతని శరీరానికి గాయాలు కూడా తగిలేయి. ఇలా నలుగురైదుగురికి జరగడంతో పోలీసులలో భయం ఏర్పడింది. పోలీసు స్టేషన్లోకి వెళ్ళకుండా స్టేషన్ కాంపౌండ్ ఆవరణలో నిలబడే డ్యూటీ చేసేవారు" అని ప్రస్తుత గ్రామ సర్పంచ్ మనోహర్ సింగ్ వివరించేరు.

షియాపూర్ MLA బ్రిడేష్ సింగ్ వెంటనే విచారణ జరిపించాలని పట్టుబట్టేరు. సీనియర్ పోలీసు ఆఫీసర్లు కనీసం 24 గంటలు ఆ స్టేషన్లో గడిపి అక్కడ ఏమి జరుగుతున్నదో ప్రజలకు తెలపాలని ఆయన పట్టుబట్టేరు.

కానీ ఏ పోలీసు ఆఫీసరూ ముందుకు రావడంలేదు. ఎందుకని అని షియాపూర్ పోలీస్ సూపరింటెండంట్ మహేంద్ర సింగ్ షికావర్ ను అడిగితే "పోలీసుల బలగం తక్కువగా ఉన్నది. అందుకని అక్కడికి ఎవరినీ పంపలేక పోతున్నాము. అందుకే అక్కడున్న స్టేషన్ను మూసేసేము. అంతే కానీ అక్కడ దెయ్యం ఉన్నదని, దానికి భయపడి ఎవరూ వెళ్ళడంలేదని చెప్పడమంతా ఉత్త పుకారే" అని ఆయన చెబుతున్నారు.

కానీ ప్రజలు చెబుతున్న కధనాలు వేరుగా ఉన్నాయి. అక్కడకోచ్చే పోలీసులు నిజాయతీగా ఉండటంలేదని, అందుకనే అక్కడున్న దెయ్యం వారిని తిప్పలు పెడుతోందని చెబుతున్నారు....ఏది ఏమైన ఇలాంటి దెయ్యాల అవసరం ఎంతైనా ఉన్నది.

No comments:

Post a Comment