Monday, March 18, 2013

నికోలా టెస్లా(Nikola Tesla):ప్రపంచ చరిత్రలోనే స్ఫూర్తి కలిగిన గొప్ప వ్యక్తి....ఫోటోలు

నికోలా టెస్లా (Nikola Tesla) (10 జూలై 1856 - 7 జనవరి 1943) ఒక ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్. నికోలా, ప్రస్తుతము క్రొయేషియాలో ఉన్న స్మిల్యాన్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు పుట్టుకతో సెర్బియన్, తర్వాత కాలంలో అమెరికా సిటిజెన్ అయ్యాడు. ఇతడు తరచూ 'ధరణిపై కాంతిని విరజిమ్మిన' ఆధునిక యుగానికి చెందిన గొప్ప శాస్త్రవేత్తగా మరియు ఆవిష్కర్తగా కీర్తించబడతాడు. 19వ శతాబ్దాంతంలో మరియు 20వ శతాబ్దపు ఆరంభంలో విద్యుత్ మరియు అయస్కాంతత్వాలకు సంబంధించిన పరిశోధనలలో విప్లవాత్మకమైన విషయాలను అందించిన శాస్త్రవేత్త. నికోలా టెస్లా పేటెంట్లుమరియు పరిశోధనా విషయాలు ఆధునిక విద్యుశ్చక్తి, ఎలక్ట్రిక్ మోటార్లు వంటి విషయాల అభివృద్దికి దోహదపడడం ద్వారా రెండవ పారిశ్రామిక విప్లవానికి నాంది పలికాయి.

1894లో వైర్లెస్ కమ్మ్యూనికేషన్ (రేడియో) ప్రదర్శన వల్ల అమెరికాలోని ఎలక్ట్రికల్ ఇంజనీర్లలో గొప్ప వ్యక్తిగా గుర్తించబడ్డాడు.


2 comments:

  1. X-rays were in vested by Rontgen.. Please correct.
    Rontgen never took patent.

    Tesla is also a great person but his investions was eclipsd by edison

    ReplyDelete