Saturday, March 2, 2013

మందు పాతర లను కనుగొనడానికి ఎలుకలకు ట్రైనింగ్...ఫోటోలు

మందు పాతర అంటే యుద్ధాల్లో వాడే ఒక ప్రేలుడు పదార్థం. వీటిని సాధారణంగా నేలలో పాతి పెడతారు. ఇవి ఒత్తిడికి గురైనా లేక ఏదైనా ట్రిప్ వైరుకు అనుసంధానించడం ద్వారా పేల్చివేస్తారు. వీటి ధాటికి 1975 నుంచి ఇప్పటి దాకా సుమారు ఒక పది లక్షల మంది మరణించారు. ఇందువల్ల ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాల్లో వీటి వాడుకను అరికట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వీటిని తయారు చేయడం సులభం, తక్కువ ఖర్చు అవుతుంది. శత్రువులను నివారించడానికి ఎక్కువ విస్తీర్ణంలో సులభంగా అమర్చవచ్చు. వీటిని సాధారణంగా మనుషులు భూమిలో పాతి పెడుతుంటారు. అయితే వీటి కోసం కూడా యంత్రాలున్నాయి.

మొజాంబిక్ అంతర్యుద్దాలలో వీటిని ఎక్కువగా వాడేరు. అంతర్యుద్దం పూర్తైనా అక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడుతున్నారు. అందువలన మందు పాతర లు ఎక్కెడెక్కడ ఉన్నాయో కనుగొనడానికి ఎలుకలకు ట్రైనింగ్ ఇచ్చి వాటిమూలంగా తెలుసుకుంటున్నారు.


No comments:

Post a Comment