Tuesday, March 5, 2013

ఒకప్పుడు అతి తక్కువ ధర కలిగిన నానో కారు, ఇప్పుడు అతి ఖరీదైన బంగారు నగల కారుగా మారింది....ఫోటోలు

భారతదేశంలో బంగారు ఆభరణ నగల సాంప్రదాయం మొదలుపెట్టి 5000 సంవత్సరాలు పూర్తైన సంధర్భంగా టైటాన్ ఇండస్ట్రీ వారు బంగారు నగల అలంకరణతో నానో కారును తయారుచేసేరు. ఈ కారును రతన్ టాటా గారు విడుదలచేసేరు.

80 కిలోగ్రాముల 22 క్యారట్ల బంగారం, 15 కిలోల వెండి మరియూ వెలకట్టలేని కొన్ని విలువైన రాళ్లతో అతి తక్కువ ధర కలిగిన నానో కారును అతి ఎక్కువ ఖరీదైన కారుగా తీర్చిదిద్దేరు. ఈ రోజున్న బంగారం కరీదుతో ఈ కారు వెల 22 కోట్లు. ఎంత బంగురు కారైనా ఇది కూడా పెట్రోల్తోనే నడపాలి. అది(పెట్రోల్)కూడా మనదేశంలో చాలా ఖరీదైనదే.


No comments:

Post a Comment