Tuesday, March 12, 2013

హత్య కేసులో ఏనుగుకు బెయిల్ మంజూరు....న్యూస్

ఆ ఏనుగు పేరు రామచంద్రన్. గుళ్ళల్లో పెంచుకుంటున్న ఏనుగులలో ఎత్తైన ఏనుగు ఇదే. భారతదేశంలో హత్యా నేరం క్రింద ఖైదు చేయబడ్డ ఏకైక ఏనుగూ ఇదే.

45 సంవత్సరాల వయస్సు కలిగిన ఈ ఏనుగు జనవరి నెల 27 వ తారీఖున గుడి సంబరాలలో పాల్గొన్నప్పుడు మదమెక్కి జనం వైపు పరిగెత్తింది. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఈ ఏనుగు ముగ్గురుని తొక్కి చంపింది. అటవీ శాఖ అధికారులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఏనుగును పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచేరు. కోర్టు ఏనుగును అటవీ శాఖ కష్టడీకి పంపించింది.

కేరళకు చెందిన The Chikottukavi Peramanglathu దేవస్థానం కు చెందిన ఈ ఏనుగు 3.17 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ ఏనుగును అందరూ ముద్దుగా రామన్ అని పిలుస్తారు. మామూలుగా మదమెక్కిన ఏనుగును రూల్స్ ప్రకారం 15 రోజులు ఎటువంటి సంబరాలలోనూ వాడకూడదు. ఈ ఏనుగు మదంతో ముగ్గురిని హతమార్చింది కనుక కోర్టు కష్టడీలో, అటవీ శాఖ అధికారుల కష్టడీలో ఉంచేరు.


ఫిబ్రవరి 12 న దేవస్థానం అధికారులు గుదిలో ముఖ్యమైన సంబరాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా ఈ ఏనుగు అవసరం ఉన్నదని, కాబట్టి ఏనుగును పంపించవలసినదిగా కోర్టును పిటీషన్ మూలంగా కోరుకున్నారు.

ఈ ఏనుగు అనిశ్చితంగా ఉన్నదని, కనుక ఈ ఏనుగు 3 నెలల పాటూ ఎటువంటి సంబరాలలోనూ పాల్గొనడానికి వీలులేదని, దానికి ఆధారంగా డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ను కోర్టుకు ఇచ్చి ఏనుగును పంపరాదని వాదించేరు. అటవీ శాఖ వారి వాదనను ఒప్పుకున్న కోర్టు ఏనుగును విడిచిపెట్టలేమని తీర్పు ఇచ్చింది.

ఆ తరువాత దేవస్థానం వారు మరో పిటీషన్ వేసేరు. దేవస్థానం రూల్స్ ప్రకారం అనిశ్చితంగా ఉన్న ఏ ఏనుగునైన రూ.50 బాండ్ పేపర్ మీద విడిచిపెట్టాలని, విడిచిపెట్టిన ఏనుగును 3 నెలలదాకా ఏ సంబరాలలోనూ వాడమని, 3 నెలల తరువాత ఫిట్నెస్ మెడికల్ సర్టిఫికెట్ కోర్టుకు చూపించి సంబరాలలో వాడుకుంటామని తెలిపేరు.

అటవీ శాఖ అధికారులు వద్దని ఎంత వాదించినా కోర్టు రూ.30 లక్షల నగదు మరియూ ఇద్దరి పర్సనల్ సెక్యూరిటీతో ఏనుగుకు బెయిల్ మంజూర్ చేసింది.

No comments:

Post a Comment