Thursday, March 14, 2013

మనుష్యులవలన జరిగిన కొన్ని ఘోర విపత్తులు....ఫోటోలు మరియూ వివరాలు

1986 చెర్నబోయల్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ప్రమాదం చెర్నబోయల్, యూక్రైన్ లో ఉన్న న్యూక్లియర్ పవర్ స్టేషన్లోని ఒక టవర్ పేలిపోయింది. దీనిలోనుండి వెలువడిన రేడియో యాక్టివ్ రేడియేషన్ హీరొషీమా మరియూ నాగసాకీల పై వేసిన బాంబు కంటే 100 రెట్లు ప్రమాదకరమైనది. దీని వలన 2,70,000 మందికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది.

1978 లవ్ కెనాల్ కెమికల్ వేస్ట్

అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరం లోని లవ్ కెనాల్ కాలువలో 21,000 టన్నుల విష పధార్ధాలను 1940-1950 మధ్య కలిపేరు. దీనిని 1978 లో కనుగొన్నారు. పుట్టుక వికలాంగులూ, అనుకోని అబార్షన్లూ మరియూ చర్మ కాల్పులతో ప్రజలు భాధపడ్డారు.హూకర్ కెమికల్స్ మరియూ ప్లాస్టిక్ కంపెనీ, కెమికల్స్ ఉన్న డ్రమ్ములను ఆ కాలువలో ఉంచేరు.

1976 సెవెసో కెమికల్ ప్లాంట్

ఇటాలీ దేశంలోని సెవేసో అనే చోట ఒక చిన్న కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం. ఈ ప్రమాదం వలన విషవాయువుతో కూడుకున్న పొగ ఆ ప్రాంతమును కప్పేసింది. వెంటనే ఆ ప్రాంతలోని ప్రజలను తరలించేరు. అక్కడ ఉన్న మొక్కలనూ , పంటలనూ వాడకూడదన్నారు.చాలామంది చర్మ వ్యాధులూ, నరాల వ్యాధులతొ భాధపడ్డారు.

1952 గొప్ప పొగ మంచు మరియూ పొగ

లండన్ నగరంలో ఏర్పడిన వాతావరణ కాలుష్యం వలన ఏర్పడిన ప్రమాదం. వరుసగా 4 రోజులు నగరాన్ని కప్పేసిన కాలుష్య పొగవలన 4,000 మంది మరణించేరు, 10,000 మందికిపైగా శ్వాశకోస రోగాలతో భాధపడ్డారు. ప్రపంచములోనే వాతావరణ కాలుష్యం వలన ఏర్పడిన మొదటి ప్రమాదం ఇదే.

1962-1971 వియత్నాం వాతావరణ సంహారము

వియత్నాంలోని 2.2 మిల్లియన్ ఎకరాల పంటపొలాలను కెమికల్ యుద్దం మూలంగా అమెరికా నాశనముచేసింది. రైన్ బో హెర్బిసైడ్ అనే కెమికల్ బాంబులను వియత్నాంలో వేసింది. ఈ కెమికల్ వలన అక్కడి పొలాలలో కనీసం 20 సంవత్సరాల వరకు ఎటువంటి సాగుబడి చేయలేరు. జీవితాంతం ఆ పోలలలో పంటలు పండకపోవచ్చు, ప్రజలకు వికలాంగ వ్యాధులు రావచ్చు.

1956 మినమతా ఖాతంలో విషం

జపాన్లోని చిసో కెమికల్ పరిశ్రమ వారు పాదరసం వేస్టును మినమతా ఖాతంలో కలిపేరు. ఆ ఖాతంలోని చేపలను తిన్న వారు వ్యాధులకు గురైయ్యేరు. 2000 మంది చనిపోగా, 10,000 మంది కిమెదడు వాపు వ్యాధి సోకింది.

1930 ది డస్ట్ బౌల్

అమెరికా మరియూ కెనడాలలో జరిపిన వ్యవసాయ మార్పులవలన మరియూ అంతకు ముందు ఏర్పడిన కరువు వలన ఏర్పడిన గాలి ధుమారం 10 కోట్ల ఎకరాలను మట్టితో కప్పేసింది, 5 లక్షల మందిని నిరాశ్రయులను చేసింది.

2010 సముద్రంలో లోతుగా వెళ్ళిన ఆయిల్ స్పిల్

మెక్సికో ఖాతంలో బీ.పీ కంపెనీ వారి వారి నిర్లక్ష్యం వలన ఆయిల్ తీస్తున్న పైపు విరిగిపోయింది. విరిగిన పైపులోనుండి బయటకు వస్తున్న ఆయిల్ ఆ ఖాతాన్నే నూనె మయం చేసింది. 11 మంది చనిపోయిన ఈ సంఘటనలో సముద్రజీవులు ఎన్ని చనిపోయినవో లెక్క కట్టలేకపోయేరు. విరిగిన పైపును సరిచేయడానికి 87 రోజులు పట్టింది. దీని వలన ఏర్పడిన వాతావరణ కాలుష్యం ఎప్పటికి సరిచేయబడుతుందో తెలియదు కానీ నష్ట పరిహారం క్రింద బీ.పీ కంపెనీ వారు 24 బిల్లియన్ డాలర్లు చెల్లించేరు.

1984 భోపాల్ ప్రమాదం

యూనియన్ కార్బైడ్ పరిశ్రమలోనుండి లీక్ అయిన గ్యాసు మూలంగా జరిగిన ఈ ప్రమాదంలో 30,000 మంది చనిపోయేరు. దీనికి రెండింతల మంది వికాలాంగులూ మరియూ తీరని వ్యాధులతో భాద పడ్డారు.

1938 హువాంగ్ హీ వరదలు

చైనాలోని హువాన్ హీ నదిలో ఏర్పడిన వరదలలో 7 లక్షల మంది చనిపోయేరు. చైనాలోనే అత్యంత ముఖ్యమైన, అతిపెద్ద నది ఇది. ఈ నది నుడి ఏర్పడే వరదలు ఊర్లలోకి రాకుండా ఉండటానికి అంతకు పూర్వమే నది తీరాన గోడలు కట్టేరు. కానీ జపాన్ సైనిక దళాల ముందడుగును ఆపడానికి అప్పటి చైన సైన్యాధిపతి ఛీంగ్ ఖై-షెక్ ఆ గోడలను పగలగొట్టించేడు.

1 comment: