Monday, March 4, 2013

భవిష్యత్తులో రాబోవు యుద్దాలు(అవి నీటికోసం జరుగబోయే యుద్దాలు)....ఫోటోలు మరియూ వివరాలు

ఈ భూమండలం మీద పరిశుద్దమైన నీటి కొరత సంక్షోభం ఎక్కువగా ఉన్నది. దీనికి కారణం మానవ నిర్లక్ష్యం. ఈ భూమండలం మీదున్న పరిశుద్దమైన నీటిలోని 1 శాతం మాత్రమే మానవులకోసం ఉన్నది. 2 శాతం నీరు ఐస్ గడ్డలుగా ఉన్నది. అది ఇప్పుడు నిదానంగా కరగడం మొదలుపెట్టి సముద్రంలో కలిసిపోతోంది. ఉప్పు నీరు మన సముద్రాలలో విస్తారముగా నిండి యున్నది. కానీ డబ్బుగలవారు మాత్రమే ఆ నీటిని మంచి నీరుగా మార్చుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా మంచినీటిని తవ్వి తీసేసి వాడేస్తున్నారు. కొన్నిచోట్ల భూమిలో మంచి నీరు లేదు. దీనివలన నీటి కరువు ఏర్పడటమే కాకుండా భూకంపాలు కూడా ఏర్పడతాయి.

వీటిలో కొన్నింటిని మానవులు సరిచేసుకోవచ్చు. కానీ పెరుగుతున్న ప్రపంచ జనభా పెరుగుతున్న మంచినీటి కొరత రానురాను ఎక్కువౌతోంది. భవిష్యత్తులో మానవులు మార్పులుచేసుకోకపోతే యుద్దాలకు కారణం ఆయిల్ అనేది పోయి నీరు కారణం అవుతుంది.

మెక్సికో నగర నీటి యుద్దం న్యూయార్క్ నగరం కాంక్రీట్ అడవిగా ఉండవచ్చు.కానీ మెక్సికో నగరం కాంక్రీట్ సముద్రం. మెక్సికో ప్రజలు పురాతణ చెరువులూ, నదులలోని నీటిని తోడేసి అక్కడ ఇళ్ళు కట్టుకున్నారు. అనుకున్నదానికంటే ఎక్కువగా భూమి క్రిందున్న పరిశుద్ద నీటిని వాడేసేరు. అక్కడ భూమి ఎండిపోయిందనే చెప్పవచ్చు. వర్షాలు నగరాన్ని వరదలో ముంచినా ఆ నీరు భూమిలోకి దిగదు. నగరంలోని వరదనీటిని తీసుకువెళ్లే పైపులు చాలాచోట్ల చిల్లులతో ఉండటంవలన వరదనీటిలో 40 శాతం కూడా గ్రుహాలకు అందించలేకపోతున్నారు. నగరానికి దూరంగా ఉన్న రిజర్వాయర్లలో నీరు తగ్గిపోతోందని తెలుసుకున్న ప్రభుత్వం నీటికోసం ప్రజలు రిజర్వాయర్ దగ్గరకు వస్తే ఏమిజరుగుతుందో ఊహించుకుని రిజర్వాయర్ల చుట్టూ కంచెలు వేసేరు. మెక్సికో నగరంలో మత్తు పధార్ధాల అరాజకత్వం ఉన్నదని అందరికీ తెలుసు. కొద్దిరోజులలో ఈ మత్తుపధార్ధాల గ్యాంగులు నీటి గ్యాంగులుగా మారి ఉన్న రిజర్వాయర్లను తమ అధికారంలోకి తెచ్చుకుని మంచినీటిని వారి కట్టుదిట్టాలలో ఉంచుకోవచ్చు.


మౌరుటానియా-సెనెగల్(Mauritania–Senegal) సరిహద్దు యుద్దం పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న ఈ రెండు దేశాల మధ్య 1981 నుండి దేశాల సరిహద్దు గురించి యుద్దం జరుగుతోంది. ఈ యుద్దంలో కొన్ని వేలమంది చనిపోతే మరి కొన్ని వేల మంది నివాసాలు కోల్పోయేరు. యుద్దానికి కారణం జాతి భేదాలూ మరియూ సరిహద్దు గొడవలూ అని చెబుతున్నారు. కాని నిజం అదికాదు.అసలైన కారణం నీరు మరియూ పెరుగుతున్న మరుభూమీకరణం. అక్కడ పెరుగుతున్న మానవ పోరాటాలవలన అక్కడి సున్నితమైన పచ్చని భూమి ఎండిపోయింది. దీని వలన వర్షాలు లేవు. దీనివలన నీటి కరువు ఏర్పడింది. సెనెగల్ దేశ నదినీటిని దారి మళ్ళించడంతో నది కూడా ఎండుముఖం పట్టింది. పెరుగుతున్న జనాభా ఇరుదేశాల పైన నీటి ఒత్తిడి తెస్తోంది.సెనెగల్ నదికోసం మరో పెద్ద యుద్దం జరిగే సూచన్లు కనబడుతున్నాయి.


చ్చడ్ సరస్సు యుద్దం

ఇది కూడా పశ్చిమ ఆఫ్రికాలోనే. ఈ సరస్సు చుట్టూ 4 దేశాలు ఉన్నాయి. చ్చడ్,కెమరూన్,నైజర్ మరియూ నైజీరియా(Chad, Cameroon, Niger, and Nigeria). కొన్ని దశాబ్ధాలుగా వర్షములేమి కారణాన ఈ సరస్సు 95 శాతం చిన్నదైపోయింది. అంతే కాకుండా సరస్సు చుట్టూ ఉన్న 30 మిల్లియన్ ప్రజలు ఆ సరస్సులోని మంచినీటిని దుర్వినియోగం చేసేరు. సరస్సు చిన్నదైపోవడం మూలానా సరస్సు చుట్టూ ఉన్న ప్రజలు హింసలకు దిగుతున్నారు. ఏదో ఒకరోజు అది 4 దేశాల మధ్య యుద్దాన్ని తీసుకురావచ్చు.


ఇజ్రైల్-పాలస్తీనియా యుద్దం నీటి కోసమే ఇజ్రైల్ తన సరిహద్దులో ఉన్న దేశాలతో యుద్దంలో ఉన్నది. ముఖ్యంగా తమ దేశంలో ఉన్న పాలస్తీనియాతోటే. BBC ఒక ప్రకటనలో 1967 యుద్దం మంచినీటి గురించేనని తెలిపింది. పశ్చిమ దేశాలలగే ఇజ్రైల్ కూడా ఒట్టొమాన్లు(Ottomans)వదిలివెళ్ళిన ప్రదేశాలలో నివసిస్తున్నారు. ఇజ్రైల్ ప్రజలు రోజుకు 300 లిటర్ల మంచినీరు వాడుకోవచ్చు కానీ పాలస్తీనియన్లకు 70 లిటర్ల మంచినీరే ఇస్తారు. వెస్ట్ బ్యాంక్ మరియూ గాజా పై అప్పుడప్పుడు జరుగుతున్న దాడుల వలన అక్కడ ఎటువంటి డెవెలప్మెంట్ చోటుచేసుకోవటంలేదు. జోర్డాన్ నది లో 95 శాతం మురికి నీరు కలిసుండటంతో మరియూ డెడ్ సీ నదిలో నీరు తగ్గిపోతున్నందువలన గోలన్ కొండల ఆక్రమణకు పాలస్తీనియన్లూ, ఇజ్రైల్ పై మరో తిరుగుబాటు చేయవచ్చు.


ఆఫ్ఘనిస్తాన్ మరియూ ఇరాన్ ఫార్ ఈస్ట్ లో 3 దేశాలు కలుసుకునే సరిహద్దు కలదు. ఆ 3 దేశాలూ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియూ పాకిస్తాన్. ఈ కలుసుకునే ప్రదేశం ఉత్త ఎడారి ప్రదేశమే. ఈ ఎడారి ప్రదేశాన్ని మొదట సోవియట్ వారు, తరువాత తాలిబన్లూ ఆక్రమించేరు. ఈ ఎడారి ప్రాంతంలోని వ్యాపారం ఏమిటంటే పేద ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను ఇరాన్ కు అమ్మడమే. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న హెల్మాండ్ నది ఇరాన్ దేశానికి కూడా ఉపయోగపడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఈ నదిపై ఒక డాం కట్టడం మొదలుపెట్టింది. కంగారు పడుతున్న ఇరాన్ ఇప్పటికే తమ దేశాస్తులను ఆఫ్ఘనిస్తాన్ దేశంలోనికి పంపి డాం కట్టకుండా ఉండటానికి ఆటంకాలు కలిగిస్తోంది. డాం గనుక కట్టి పూర్తిచేస్తే ఇరాన్ కు పెద్ద నష్టం ఏర్పడుతుంది. అందువలన ఇరాన్ వారు ఆ డాం ను పేల్చడమో లేక ఆ మొత్త ప్రదేశాన్ని ఆక్రమించడమో జరుగుతుంది.


ఇరాక్,టర్కీ,సిరియా మరియూ ఇరాన్ మంచి నీటికోసం మెసపటోమియా నదిపై ఆధారపడ్డ దేశాలు ఇవి. ఇరాక్ దేశంలో జరుగుతున్న అంతర్ యుద్దాల వలన మిగిలిన మూడు దేశాలూ ఇరాక్ కు వెళ్ళే నీటిని అడ్డుకుంటున్నాయి. సిరియా మరియూ టర్కీ ఇప్పటికే వారి దేశాలలో ఈ నది పై డాములు కట్టేసేరు. టర్కీ మరో డాం కట్టడానికి సన్నాహాలు పూర్తిచేసింది. దీనితో ఇరాక్ దేశానికి వెళ్ళవలసిన నీరు వెళ్ళడంలేదు. సిరియాలో కలహాలు జరుగుతున్నందువలన వారు కట్టాలనుకున్న డాములు ఆగిపోయినై. కాని కొన్ని రోజులలో సిరియా కలహాలు సర్ధుకోవచ్చు. అప్పుడు ఇరాక్ కు నీరు అసలు అందదు. ఇరాన్ నుండి ఇరాక్ దేశానికి ఇప్పుడు నీరు అందుతోంది. ఎక్కువ నీటిని వాడుకోవద్దని ఇరాక్ ప్రభుత్వానికి ఇరాన్ తెలియజేసింది. అందువలన నీటికోసం ఇరాక్ సిరియా మీద దాడి చేయవచ్చు. ఇరాక్ మరియూ సిరియా దేశ ప్రభుత్వాలు అంతర్ కలహాలలో చిక్కుకున్నందువలన అక్కడున్న ప్రజలు ఏదో ఒక దేశ సహాయముతో అక్కడి నీటి వసతులనూ మరియూ ఆయిల్ వసతులనూ చెజిక్కుంచుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది.


సన్నా,యేమన్ యేమన్ దేశం ఎప్పటి నుండో నీటి కరువుతో అవస్తపడుతోంది. ఈ దేశ ప్రజలు నీటికోసం కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్ళవలసివస్తోంది. ప్రపంచంలోనే యేమన్ లో ఉన్న సన్నా మాత్రమే నీటి కరువుతో అలమటించిపోతోంది. అరబ్ అల్లర్ల వలన యేమన్ దేశ సర్వాధికారి తరిమివేయబడ్డాడు. అధికారాన్ని చేజిక్కించుకోవటానికి మాత్రమే అక్కడున్న నాయకులు పోటీ పడి యుద్దాలు చేస్తున్నారు . కానీ ఎవరూ అక్కడి మంచి నీటి కొరతను తీర్చడానికి కావలసిన వసతులు చేయడంలేదు. అందువలన అక్కడి ప్రజలు సౌదీ అరేబియాకు వెళ్ళి శరణార్ధులుగా ఉండిపోవచ్చు. ఇదే గనుక జరిగితే, నీటికోసం శరణార్ధులుగా వెళ్ళేవారు ప్రపంచంలో మొదటి వారు వీరే అవుతారు.


సౌత్ ఈస్ట్ ఆసియా సౌత్ ఈస్ట్ ఆసియా లో ఉన్న దేశాలన్నీ ఒకే నదుల నీటిపై ఆధారపడియున్నారు. పైన ఉన్న దేశాలు డాములు కడితే క్రింద ఉన్న దేశాలకు నీటికొరత ఏర్పడుతుంది. కరెంటు దాహమున్న చైనా తమ దేశం పైన ఉన్న లావోస్ మరియూ బర్మా దేశాలను డాములు కట్టుకుని అందు నుండి వెలువడే కరెంటును వారికి అమ్మమని తెలిపేరు. బర్మా దేశం చైనా వారి ప్రభావానికి లొంగలేదు. నదులపై కట్టాలనుకున్న డాములను కట్టడం కూడా నిలిపివేసేరు. లావోస్ మాత్రం చైనా చెప్పినట్లే చేసింది. మరికొన్ని చోట్ల కూడా డాములు కట్టడానికి సన్నాహాలు చేస్తోంది. మరికొన్ని డాములు కడదామనుకుంటున్న లావోస్ ను, ఇకపై డాములు కట్టకూడదని వియత్నాం మరియూ కంబోడియా దేశాలు లావోస్ కు హెచ్చరికలు జారీచేసినై. కంబోడియా మీద దాడిచేసిన వియత్నాం లావోస్ మీద దాడిచేయడనికి వెనుకాడదు. అదే గనుక జరిగితే చైనా లావోస్ కి సహాయం అందిస్తుంది. అప్పుడు అది పెద్ద యుద్దంగా మారే అవకాశం ఎక్కువగా ఉన్నది.


నైలు నది యుద్దం నైలు నది అతిపెద్ద నది. ఈ నది ఆఫ్రికా ఖండం నుండి మరికొన్ని దేశాలలో ప్రవహిస్తున్నది. కానీ ఈ నది నీటిలో 90 శాతం ఈజిప్ట్ వాడుకుంటోంది. ఈ నది యొక్క 85 శాతం నీరు ఇతియోపియా దేశం నుండి వస్తున్నది. ఇతియోపియా నైలు నది నీటిని ఎక్కువగా ఉపయోగించుకోవటానికి చాలా డాములు కట్టింది. అయితే ఆ డాములన్నిటినీ ఈజిప్ట్ డబ్బు సహాయంతోనూ, ఒప్పందాలతోనూ కట్టింది. ఇతియోపియా మరికొన్ని డాములు తానుగా కట్టుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే ఈజిప్టు ఇతియోపియాకి హెచ్చరిక జారీచేసింది. నైలు నది ప్రవహించే ఇతర దేశాలు నైలు నది నీటిలో తమకూ వాటా కావాలని అడుగుతున్నాయి. ఆ దేశాలన్నీ కలిపి ఇతియోపియాపై డాములు కట్టి నది నీటిని తమ దేశాలకు తరలించమని ఒత్తిడి తెస్తున్నాయి. నైలు నదిపై ఎక్కువ ఆధారపడే ఈజిప్ట్ మరియూ సౌత్ సూడాన్ దేశాలు ఒకటై ఇతియోపియాపై దాడికి ఎప్పుడైనా దిగవచ్చు.


భారత్-పాకిస్తాన్

ఇరు దేశాలూ ఇప్పటికే చాలాసార్లు యుద్దాలు చేసినై. ఇద్దరి దగ్గరా న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. కాష్మీర్ గురించి ఎప్పుడో ఒకప్పుడు యుద్దాలకు దిగవచ్చు. అప్పుడు ఈ మరణాయుధాలు వాడవచ్చు. కానీ అంతకు ముందు జెలుం నది నీటి వాటాలలో గొడవలు రావచ్చు. భారతదేశం జెలుం నది పై డాములు కట్టడానికి నిర్ణయించుకుంది. పాకిస్తాన్ దీని గురించే ఎక్కువగా భయపడుతున్నది. కాష్మీర్ గురించి యుద్దానికి దిగితే, భారతదేశం జెలుం నది జలాలను పాకిస్తాన్ కు ఇవ్వకుండా ఆపవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్లో నీటి కొరత చాలా ఉన్నది. ఆ దేశంలో జరుగుతున్న అల్లర్లూ, తాలిబన్ల పై వారి యుద్దం పాకిస్తాన్ అభివ్రుద్దికి మరింత అడ్డంకావచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వానికి బదులు పాకిస్తాన్ తాలిబన్ల చేతులలోనో లేక ఇంకో ఉగ్రవాదుల చేతులలోనో చిక్కుకుంటే సమస్య పెద్దదౌతుంది.

3 comments:

 1. Nice and thought provoking article.

  ReplyDelete
 2. లంకె ముఖపుస్తకం లో పోస్ట్ చేస్తున్నాను...మీ అనుమతి లభించింది అనుకుని.....
  ఇక మీ టపా చాలా బాగుంది(అందుకె లంకె షేర్ చేస్తున్నాను!) :)

  ReplyDelete
  Replies
  1. Narsimha గారికి

   ధన్యవాదాలు

   మీకోసం

   Delete