Saturday, March 2, 2013

మదర్ థెరీసా యొక్క పరహితవాదం మరియూ దాతృత్వము కల్పితం: పరిశోధకలు

మదర్ థెరీసా యొక్క పరహితవాదం మరియూ దాతృత్వము ఒక కల్పితం అని కొందరు పరిశోధకులు తెలుపుతూ, అమె పవిత్ర ఆకారము అమె మీద జరిపిన పరిశీలనలో నిరూపణ కాలేదు సరికదా అమె తన వ్యక్తిత్వాన్ని మెరుగు పరుచుకోవడానికి మీడియావారిని ఉపయోగించుకున్నారు అని తెలిపేరు.

Serge Larivee and Genevieve Chenard of University of Montreal's Department of Psychoeducation and Carole Senechal of the University of Ottawa's Faculty of Education వారు ఈ విషయాన్ని తెలిపేరు.

"ఒక సెమినార్ కోసం, అందులో ఆమె గురించి, అమె పరహితవాదం మరియూ దాతృత్వము గురించి గొప్పగా మాట్లాడటానికి మేము అమె గురించి సేకరించిన సాధనపత్రములు ఆమె నిజ స్వరూపాన్ని బయటపెట్టినై" అని పరిశోధనల నిర్వహణ కమిటీ హెడ్ Professor Larivee అన్నారు.

"వెంటనే మేము అమె గురించి మరింత తెలుసుకోవడానికి మరికొన్ని పత్రాలు సేకరించేము. మొత్తం 502 పత్రాలను సేకరించేము. అందులో 192 పత్రాలు నకిలీవని తెలుసుకుని వాటిని వేరుచేసేము. ఈ పత్రాలలో 98 శాతం ఆమె స్థాపించి, నడిపిన Order of the Missionaries of Charity (OMC) కి సంబంధించినవి. ఆ పత్రాలలోని నిజాలు అమే యొక్క పరహితవాదం మరియూ దాతృత్వము కల్పితమని రుజువుచేసినై" అని ఆయన అన్నారు.

వారు రాసిన వ్యాసంలో మదర్ థెరీసా వ్యక్తిత్వం గురించి వాటికన్లో (రోములో)వారు సరైన వివివరాలు సేకరించలేదని, ఉదాహరణకు: అమె రోగులపై అవిశ్వసనీయ లక్ష్యము చూపుట, రాజకీయ నాయకులతో అమెకున్న ప్రశ్నార్ధకమైన సంబంధం, అమె తీసుకున్న అపరిమితమైన డబ్బును ఎలా ఖర్చుపెడుతున్నారు, అమె పెడసరమైన ఉద్దేశాలు, ముఖ్యంగా abortion, contraception, and divorce పైన వివరాలు సేకరించలేదని ఆయన తెలిపేరు.

ఆమె చనిపోయేనాటికి పేదలకోసం మరియూ రోగులకోసం 100 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా 517 సేవాసమితులు ఉన్నాయి. కలకత్తాలో ఆమె నిర్వహించిన సేవాసమితి గ్రుహాలలో చాలా గ్రుహాలు చనిపోతున్న వారి గ్రుహాలు ("homes for the dying")అని ఆ గ్రుహాలకు వస్తున్న డాక్టర్లు చెబుతున్నారు. ఈ గ్రుహాలలో తమకు మంచి వైద్యం లభిస్తుందని అక్కడ చేరుతున్న రోగులలో 70 శాతం రోగులు ఆశపడుతుంటే, అందులో 30 శాతం వారికి మాత్రమే వైద్యం చేసేవారట. మిగిలిన రోగులు చావుబ్రతుకులతో పొరాడుతూండేవారట. అక్కడికి వచ్చే డాక్టర్లు అక్కడ పరిశుద్ధత ఉండేది కాదని,అనర్హమైన పరిస్థితి ఉండేదని, సరైన మందులు, సేవలు అందిచేవారు, భోజనమూ తక్కువగా ఉండేదని చెప్పేరట.

ఈ సమస్యకు కారణం డబ్బులేక కాదట. ఎందుకంటే మదర్ థెరీసా మిల్లియన్ల డాలర్ల డబ్బును సేకరించిది. వేదనకూ మరియూ చావుకూ అమేకున్న భావనే దీనికి కారణమట. ఇదే ప్రశ్నను అమెను అడిగినప్పుడు "రోగుల వేదనలో యేసు ప్రభువు వేదన భరించే మనోభావాన్ని పెంచాలనే నా తాపత్రయం" అని అమె ఒక సారి నాతో చెప్పిందని Christopher Hitchens అనే పత్రికా విలేఖరి తెలిపేరు.

కానీ అమె తన ఉపశమన ఆరోగ్య వైద్యానికి అమెరికా వెళ్లేవారుట. అమె తమ స్థాపనలోని వేలది మంది కోసం ప్రార్ధనా ఔదార్యము ఎక్కువుగా చూపించేవారు కానీ వారి ఆరొగ్య వేదనలకు ఎక్కువ ఔదార్యము చూపించేవారు కాదు. భారతదేశంలో ఎన్నో వరదలు వచ్చినప్పుడూ మరియూ భోపాల్ ఘోర ప్రమాదం జరిగినప్పుడు ఆమె ప్రార్ధన చేసిన మేరి మాత ప్రతిమలు కానుగా ఇచ్చేవారు కానీ డబ్బు మాత్రం సహాయంగా అందించేవారు కాదని తెలిపేరు.

కానీ అమెకు ఎందరొ అందిస్తున్న గౌరవాలూ, డొనేషన్లు మాత్రం తీసుకునేవారట. అమె స్థాపించిన Order of the Missionaries of Charity (OMC) కి కొన్ని మిల్లియన్ల డాలర్లు బదిలీచేసేరు కానీ వాటిలో చాలా అకౌంట్లను రహస్యంగానే ఉంచేరట.

పేదలకోసం ఆమె సేకరించిన మిల్లియన్స్ ఆఫ్ డాలర్ల డబ్బు ఎక్కడపోయింది అనేది ప్రశ్నగానే ఉన్నది. భంగపరచు ఇన్ని నిజాలు ఉన్నా ఆమె ఎలా తన వ్యక్తిత్వాన్నీ, దైవంతో సమానమనే పేరును ఎలా తెచ్చుకుంది?....1968 లో ఈమె BBC పత్రికా విలేకరి Malcom Muggeridge ను కలవడమే దీనికి ముఖ్య కారణం. ఈ పత్రికా విలేఖరి మదర్ థెరీసా గురించి ప్రచురించడం మొదలుపెట్టేరు. 1969 లో మదర్ థెరీసా స్థాపించిన స్థాపన గురించి స్తుతిస్తూ ఒక సినిమా తీసేరు. ఆ తరువాత ఆమె ఎన్నో దేశాలు తిరిగేరు, ఎన్నో బిరుదులు అందుకున్నారు. నోబుల్ ప్రైజుగూడా తీసుకున్నారు. అమె చనిపోయిన వెంటనే వెటికన్లో అమెను దేవతా మూర్తిగా ప్రకటించేరు.(మామూలుగా ప్రసిద్ది చెందినవారు ఎవరు చనిపోయినా 5 సంవత్సరాల తరువాతే దేవతామూర్తిగా ప్రకటిస్తారు). కానీ మదర్ థెరీసా చనిపోయిన వెంటనే ప్రకటించేరు. దీనికి ఒక కారణం ఉన్నది. .Monica Besra అనే ఒకామె విపరీతమైన పొత్తికడుపు నొప్పితో బాధ పడుతూంటే, ఆ నొప్పి తనకు మదర్ థెరీసా తన కడుపుపై ప్రార్ధించి ఉంచిన ప్రతిమ వలనే పోయిందని చెప్పడమే. కానీ అమెకు వైద్యంచేసిన డాక్టర్లు మాత్రం ఆమెకు తాము ఇచ్చిన మందులవలనే కడుపునొప్పి తగ్గిందని చెబుతున్నారు.

ఈ విషాయాలన్ని తమ వ్యాసంలో రాసి దానికి తగిన ఆధారాలతో The journal Studies in Religion/Sciences religieuses లో ప్రచురించబోతున్నారట.

No comments:

Post a Comment