Tuesday, March 5, 2013

అందరి గమనికకూ ఒక ముఖ్య మనవి....మీకోసం

మీకోసంలో నేను మీకందరికీ అందిస్తున్న టపాలు సాధ్యమైనంతవరకు(90%)తెలుగులోనే అందిస్తున్నాను. కొన్ని టపాలలొ అక్కడక్కడ ఆంగ్లం వాడవలసి వస్తున్నది. కారణం, అవి ఆంగ్లంలో రాస్తేనే టపాలోని అసలు,సిసలైన అర్ధం చదివేవారికి తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు అర్ధాలు సరిగ్గా కుదరడంలేదు. నా బ్లాగులో నేను ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న,జరిగిన, అందమైన విషయాలను అందిస్తున్నందువలన అక్కడక్కడ ఆంగ్లభాష వాడక తప్పటంలేదు. మరో ముఖ్య విషయమేమిటంటే నా ఈ తెలుగు బ్లాగును పరిభాషా విదేశీయులు సైతం విజిట్ చేస్తున్నారు. ఒక్కోసారి వారికోసం అక్కడక్కడ ఆంగ్ల భాష వాడవలసి వాడుతున్నాను.


కానీ కొంతమంది తెలుగు బ్లాగులో ఆంగ్లం వాడటమేమిటని ప్రశ్నిస్తున్నారు. నేనూ నా బ్లాగులో ఈ నెల 1 వ తారీఖు నుండి ఎన్నో టపాలను అందించేను. "కూడలి" వారు ఎందుకనొ నా బ్లాగును అప్డేట్ చేయటంలేదు. కారణం నాకు తెలియదు. మిగిలినవారు అంటే: హారం,జల్లెడ,సంకలిని,బ్లాగిల్లూ,మాలిక,గూగుల్,గూగుల్+ మరియూ ఇతర తెలుగు బ్లాగు డైరెక్టరీలు, కొందరు తెలుగు బ్లాగర్లు మరియూ మరికొన్ని ఇతర ఆంగ్ల డైరెక్టరీలు అప్డేట్ చేస్తున్నాయి.


పైన రాసిన విషయాలను అందరూ గమనించి, అర్ధంచేసుకోవలసిందిగా మనవిచేసుకుంటున్నాను.


మీకోసం

5 comments:

  1. మీ బ్లాగు ఎంతో బాగుంటుంది, ప్రతి రోజు చూస్తుంటాను, ఆంగ్ల పదాల సమస్య లేదు, కొన్ని సమయాలలో అవసరం కూడా. కృతఙ్ఞతలు.

    ReplyDelete
  2. kavalante english lo kuda vivarana pettandi.
    paradeseeyulu kuda chustunnaaru kabatti , vaallaki kuda soukaryangaa untundi.

    ReplyDelete
  3. ఒకే వాక్యంలో వ్రాస్తే చదువుతాం, లేదా ఫొటోలు చూసి చిటికెలేస్తాం... వీలైతే ఇంగ్లీషులో (రెండు భాషల్లో)కూడా పెట్టండి..

    ReplyDelete
  4. samasya ledu telugu english mixing kooda teluguku andame ilaage konasaaginchandi maarpu loddu. em badha padavaddu.
    -sudarsan, Rajahmundry cell: 98480 96374

    ReplyDelete