Friday, March 22, 2013

భూతాపంతో తల్లడిల్లిపోతున్న ధరిత్రికి ఉపశమనం కలిగించండి: ఈ రోజు ఎర్త్ అవర్ లో పాల్గొనండి......సమాచారం

మీరుకూడా సంవత్సరానికి ఒక మారు జరుగుతున్న "ఎర్త్ హవర్" లో పాల్గొని ప్రపంచ వాతావరణాన్ని కాలుష్యం కాకుండా ఉండటానికి మీతోటి సహాయంగా ఈరోజు అంటే మార్చ్ 23 వ తారీఖున రాత్రి 8.30 నుండి 9.30 వరకు మీ ఇల్లలోని లైట్లనూ, ఎలెక్ట్రికల్ సామగ్రిని ఆఫ్ చేయండి. మీకు తెలిసినవారికి మరియూ తెలియనివారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి వారిని కూడా ఈ వరల్డ్ వైడ్ "ఎర్త్ హవర్" లో పాల్గొనమని అడగండి.


ఈ "ఎర్త్ హవర్" అనే కార్యక్రమాన్ని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (World Wide Fund for Nature) వారు ప్రపంచములోని అన్ని నగరాలలోనూ మార్చ్ నెల చివరి శనివారం నాడు జరుపుతూ తాముకూడా భూ వాతావరణాన్ని కాలుష్యం నుండి కాపాడుతున్నామని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వారం పండుగ రోజు కనుక ఈ సంవత్సరం ఈ శనివారం(అంటే ఈరోజు) జరుపుతున్నారు.

ఒక గంట సేపు లైట్లు ఆఫ్ చేసి .....ఆ గంట సమయంలో కాండిల్స్ వెలిగించుకుని కుటుంబీకులందరూ ఒక చోట కూర్చుని భోజనం చేస్తూ దాన్ని కాండిల్ లైట్ డిన్నర్ గా మార్చుకోండి...షాపింగ్ మాల్స్,హోటల్స్ మరియూ నగరంలో ఆ టైములో మీరు ఎక్కడున్నా అందరినీ ఆ సమయములో లైట్లను ఆపవలసినదిగా కోరండి.

పోయిన సంవత్సరం డిల్లీ మరియూ ముంబై నగరాలు కలిసి 1400MV కరెంటును ఆదా చేసేరట.


ఈ "ఎర్త్ హవర్" మొట్టమొదట 2007 సంవత్సరములో ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో ప్రారంభించేరు. ఆ తరువాత 2008 లో 35 దేశాలలొ ప్రారంభించేరుట.2009 లో 88 దేశాలలో "ఎర్త్ హవర్" పాటించేరు.


ఈ సారి, ఎక్కువ దేశాలలో ఎక్కువమంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

No comments:

Post a Comment