Monday, March 18, 2013

ఆంట్రో మొవియో: మడతపెట్టుకుని సూట్కేసు లాగా తీసుకువెళ్లగలిగే ఎలెక్ట్రిక్ స్కూటర్...ఫోటోలు

హంగేరీ దేశానికి చెందిన ఆంట్రో అనే కంపెనీ మడతపెట్టుకోగలిగే ఎలెక్ట్రిక్ స్కూటర్ ను తయారుచేసింది. పార్కింగ్ తో అవసరంలేకుండా, పార్కింగ్ శ్రమ పడకుండా వెళ్ళవలసినచోటుకు వెళ్ళి, ఆ తరువాత అక్కడ దానిని మడత పెట్టి సూట్ కేసు లాగా మనతో పాటు తీసుకువెళ్ళవచ్చు. 55 పౌండ్ల బరువు మాత్రమే కలిగిన ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ 28 మైళ్ల వేగంతో వెళ్లగలదు.

సంవత్సరానికి 4000 స్కూటర్లు తయారుచేయగలమని చెబుతూ, స్కూటర్ ఖరీదును రూ.1,75,000 నుండి రూ. 2,25,000 దాకా ఉంటుందని తెలిపేరు. ఈ స్కూటర్ కు మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.


No comments:

Post a Comment