Saturday, March 16, 2013

శివుడిని ప్రార్ధించటం మత సంబంధమైన కార్యము కాదు:ఆర్ధీక పన్నుల ట్రైబునల్....న్యూస్

"శివుడు, హనుమంతుడు, దుర్గాదేవి దేవతలు ప్రత్యేకముగా ఒక మతానికే చెందినవారు కాదు. వారంతా సర్వజగత్తుకూ అతీత శక్తులు కలిగినవారు" అని నాగపూర్ అర్ధీక పన్నుల ట్రైబునల్ చెప్పింది.

నాగపూర్ లోని ఒక శివాలయం తమ ఆదాయంలో 5 శాతం కు పైగా మత సంబంధిత ఖర్చులకు ఉపయోగిస్తున్నారని, కావున వారు అర్ధీక పన్ను మినహాయింపు కోరడంలో న్యాయంలేదని కనుక వెంటనే తమకొచ్చిన ఆదాయానికి ఆదాయపు పన్ను కట్టమని నాగపూర్ ఆర్ధీక పన్నుల శాఖ ఆలయ అధికారులకు నోటీసు పంపించేరు.

ఆ నోటీసు చెల్లదని తమ ఆలయానికి ఆర్ధీక పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఆలయ అధికారులు ఆర్ధీక పన్నుల ట్రైబునల్లో ఒక పిటీషన్ ధాకాచేసేరు.

ఆర్ధీక పన్ను మినహాయింపు కోరే ఆలయాలు తమ ఆదాయంలో 5 శాతం కు పైన మత సంబంధిత ఖర్చులకు ఖర్చు పెట్టినట్లైతే వారు పన్ను మినహాయింపు పరిధిలోకి రారని ఆర్ధీక పన్నుల చట్టాలు చెబుతున్నాయి కాబట్టి ఈ ఆలయ అధికారులు పన్ను మినహాయింపు కోరకూడదని అర్ధీక పన్నుల శాఖ వారు వాదించేరు.

వారి చట్టాలను ఖండిస్తూ శివుడికి, హనుమంతునికీ, దుర్గాదేవికీ చేస్తున్న ఆలయ ఖర్చులు మత సంబంధిత ఖర్చులలో లెక్క కట్టకూడదని ఆలయ అధికారులు వాదించేరు.

“హిందూ ధర్మం ఒక మతము కాదు, ఒక వర్గమూ కాదు. హిందూ ధర్మం ఎన్నో వర్గాలతో కూడినది. వారంతా ఎంతోమంది దేవతలను వేరువేరు విధంగా పూజిస్తారు. హిందూ మత సాంప్రదాయ జీవితం అవలింబిస్తున్నవారు దేవుళ్ళను పూజించాలనే ఖచ్చితమైన అంశాలు లేవు. హిందూ మత సాంప్రదాయంలో ఎన్నో రకాల మనుష్యులు ఉన్నారూ, ఎన్నో రకాల అభిప్రాయలు కలిగి ఉన్నారు. వీల్లందరికీ దేమునిపై ఒక అస్పష్టమైన నమ్మకం ఉన్నది కానీ దీనిని హిందూ మత మూలాధారం అని మాత్రం చెప్పలేము" అని అర్ధీక పన్నుల శాఖ వాదించింది.

"ఒక వర్గం అంటే వారంతా కలిసి ఒకేచోట నివసిస్తూ ఉండటం, ఒకే చట్టం క్రింద రావడం, ఒకే విధమైన హక్కు,అనుకూలత కలిగి యుండటం. ఇది క్రైస్తవ మతస్తులకూ, మిస్లీములకూ వర్తిస్తుందిగానీ హిందువులకు వర్తించదు" అని కూడా వాదించేరు.


2008 లో ఈ ఆలయ సంస్థానం రూ.82,997 ఆలయ పోషణకూ, ఉచిత ఆహార సేవకూ, ఆలయ దీపారాజనలకూ, ప్రార్ధనలకూ, భక్తులకు యోగా, టైలరింగ్ మరియూ ఉచిత కళ్ళజోళ్ళు ఇచ్చినందుకూ ఖర్చుపెట్టేరు.

ఆలయ పోషణ, ఉచిత ఆహారం,ఆలయ దీపారాజన, ప్రార్ధనలకూ ఖర్చు పెట్టిన డబ్బు మత సంబంధమైనదేనని,దీనికి ఖర్చు పెట్టినదానికి పన్నుకట్టాల్సిందేనని,ఇకపోతే సేవా కార్యాలకు(అంటే యోగా,టైలరింగ్ మరియూ ఉచిత కళ్లజోళ్ళు)ఖర్చుపెట్టిన ఖర్చుకు మాత్రమే పన్ను మినహాయింపు వర్తిస్తుందని వాదించేరు.

"ఈ ఆలయం ప్రత్యేకంగా ఒక మతస్తులకు మాత్రమే కట్టింది కాదు. దేవుని విగ్రహాలు ప్రతిష్ట చేయడం కూడా మత సంబంధమైన కార్యం కాదు. మతం అంటే నమ్మకం. దైవ శక్తులతో మనుష్యులను కట్టుబాటుచేసే దైవ శక్తులను ప్రార్ధన చేయడం. ఈ నమ్మకం ఒక ప్రత్యేక మతస్తులకు మాత్రమే చెందినది కాదు. మనుష్యులందరికీ చెందినది. ఈ ఆలయానికి ఎవరైనా రావచ్చు, ప్రార్ధన చేయవచ్చు.ఈ ఆలయానికి వచ్చే ప్రతి మనిషికీ ఆ అవకాశం కలిపించడమే ఈ ఆలయ ద్యేయం. అంతేకానీ ఈ ఆలయం మత సంబంధిత ప్రదేశం కాదు. ఇక్కడ ఖర్చుపెట్టేవన్నీ కూడా మనుష్యుల నమ్మకాలను గౌరవించడం కొరకే. ఇక్కడ మత సంబంధిత ఖర్చు అనేదే లేదు. అంతా సేవా ఖర్చే" అని ఆలయ అధికారులు వాదించేరు.

ఆలయ అధికారుల వాదనతో ఏకీభవించిన ఆర్ధీక పన్నుల ట్రైబునల్ దేవుని (ఈ ఆలయం శివాలయం)ప్రార్ధించడం మత సంభంధిత కార్యం కాదు అని తెలుపుతూ ఆలయానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని తీర్పునిచ్చేరు.

No comments:

Post a Comment