Friday, March 15, 2013

హగియా సోఫియా: మొదట చర్చ్,తరువాత మసీదు,ఇప్పుడు మ్యూజియం....ఫోటోలు మరియూ వివరాలు

టర్కీలోని అతి పెద్ద నగరం ఇస్తాంబుల్. ఆరు కొండలమీద కట్టిన ఈ నగరంలోకి అడుగుపెట్టిన వారు ఒక వింత లోకంలోకి ప్రవేశించిన అనుభూతిని పొందుతారు. అందమైన నిర్మాణాలతో, సుందరమైన మసీదులతో, విశాలమైన రోడ్లతో తీర్చిదిద్దిన ఈ నగరం సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. అపురూపమైన ఈ నగర అందాలు, దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి అప్పట్లో ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని ఒట్టోమాన్ చక్రవర్తులు పరిపాలించారు. ఎంతో అందమైన ఈ భవనాల్లో ఎక్కువగా ఆ కాలంలోనే రూపుదిద్దుకున్నాయి. అప్పటి నుంచి ఎన్నోసార్లు శత్రువుల దాడులను ఎదొర్కొని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడింది ఇస్తాంబుల్.

హగియా సోఫియా

ఒకప్పుడు చర్చిగా, తర్వాత మసీదుగా, ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న హగియా సోఫియాను పర్యాటకులు ఇస్తాంబుల్‌లో ముందుగా సందర్శించాల్సిన ప్రదేశంగా చెప్తారు. 360 లో మొదట్లో చర్చిగా నిర్మితమైన ఈ కట్టడం క్రైస్తవ భక్తులను విశేషంగా ఆకర్షించేది. శాంక్తా సోఫియా అనే ఈ చర్చి శత్రువుల దాడిలో ధ్వంసమైంది. ఆ తరువాత జస్టునియన్ అనే రాజు దీన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే 532వ సంవత్సరంలో తమ అద్భుత శైలిలో చర్చిని పునర్నిర్మించారు. నగరం మధ్యలో నాలుగువైపులా నాలుగు మినారెట్‌లతో, అంబరాన్ని తాకుతున్నట్టనిపించేంత పెద్గ గోపురంతో హగియా సోఫియా రూపొందింది. ఈ గోపురం 101 అడుగుల వ్యాసార్థం, 108 అడుగుల ఎత్తు కలిగి చూపరులను కట్టిపడేస్తుంది. ఈ గోపురం చుట్టూ నాలుగు గవాక్షాలుంటాయి. తర్వాత దీన్ని హగియా సోఫియా చర్చి అని పిలవడంతో ఆ పేరే స్థిరపడిపోయింది. ఆ తర్వాత 1453వ సంవత్సరంలో ఇస్తాంబుల్ నగరం సుల్తాన్ మొహమద్ II పరిపాలనలోకి రావడంతో ఈ చర్చిని మసీదుగా మార్చాడు. అప్పటి నుంచి 1935 వరకు కూడా అది హగియా సోఫియా మసీదుగానే ఉంది. అయితే టర్కీ స్థాపకుడు అటాటర్క్ 1935లో దీన్ని మ్యూజియంగా మార్చారు. అప్పటి నుండి ఇప్పటివరకూ అది మ్యూజియంగానే ఉన్నది. దీనిని ఎనిమిదవ వండర్ గా కూడా చెబుతారు.


No comments:

Post a Comment