Thursday, March 14, 2013

ఈ రోజుల్లో బాల కార్మీకులు.... ఫోటోలు మరియూ వివరాలు

బాల కార్మికులు అనే పదం రోజువారీ మరియు నిరంతర శ్రామికులుగా పనిచేసే బాలలను సూచిస్తుంది. బాల కార్మికతను అనేక అంతర్జాతీయ సంస్థలు దోపిడీ వ్యవస్థగా పరిగణిస్తున్నాయి, అనేక దేశాల్లో ఇది చట్టవిరుద్ధం కూడా. చరిత్రవ్యాప్తంగా బాల కార్మికులను వివిధ రకాలుగా ఉపయోగించుకున్నారు. అయితే పారిశ్రామిక విప్లవం సందర్భంగా శ్రామిక పరిస్థితుల్లో మార్పులు, సార్వత్రిక విద్య ప్రవేశం, శ్రామికులు మరియు బాలల హక్కులు తెరపైకి రావడంతో ఇది ప్రజా సమస్యగా మారింది.

అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో, నిర్ణీత వయస్సులోపల ఉన్న బాలలు (ఇంటి పనులు లేదా పాఠశాల సంబంధ పనులు మినహాయించి) పని చేయడాన్ని అక్రమం లేదా దోపిడీగా పరిగణిస్తారు. నిర్దిష్ట వయస్సులోపల ఉన్న బాలలను పనిలోకి తీసుకోవడానికి యజమానులకు అనుమతి లేదు. కనీస వయస్సు అనేది దేశాన్ని మరియు పనిని బట్టి మారుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ 1973లో చేసిన కనీస వయస్సు ఒప్పందాన్నిదేశాలు ఆమోదించి, 14 నుంచి 16 సంవత్సరాల మధ్య కనీస వయస్సు పరిమితిని విధించాయి. ఎటువంటి ఆంక్షలు మరియు తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏదైనా వ్యవస్థలో పనికి వెళ్లేందుకు కొన్నిదేశాలు బాల కార్మిక చట్టాలు కనీస వయస్సును 16 ఏళ్లుగా నిర్ణయించాయి.

షో వ్యాపారం


తమ పిల్లలు ఒక ప్రసిద్ద సినీ నటుడుగానో/నటిగానో,డాన్సర్ గానో, గాయనీ గాయకులగానో అవ్వాలని ఎందరో తల్లితండ్రులు అనుకుంటున్నారు. దీనిని ఎవరూ నిజంకాదని అనలేరు.అందుకనే ఈ మధ్య వివిధ టీవీ చ్చెనల్స్ లో వస్తున్న రియాలిటీ ప్రోగ్రాములు,షోలూ ఎక్కువగా పిల్లలకోసం ఏర్పాటుచేస్తున్నారు. ఇది ఒక విధమైన బాల కార్మీకుల ఉపయోగమే అవుతుంది. ఎందుకంటే టీవీ చ్చెనల్స్ తమ సొంత పురోగతికోసం ఇలాంటి పిల్లల రియాలిటీ షోలు ఏర్పాటుచేసి, అందులో పాల్గొనేవారు తాము చెప్పిన విధంగానే చేయాలని పిల్లలకు ఆంక్షలు పెడతారు. ఇది పిల్లలను తమ కోసం వాడుకోవడమే అవుతుంది అని ఒక ప్రసిద్దిచెందిన సైకాలజిస్ట్ తెలిపేరు. ఇందులో పాల్గొనే పిల్లలు జీవితంలో త్వరగా తమ సొంత ఆలోచనలకు ఎక్కువగా ముఖ్యత్వం ఇస్తారు. చిన్న వయసులోనే పెద్దలకు దొరకవలసిన స్వతంత్రం దొరుకుతుంది. ఈ రియాలిటీ షోలలో పాల్గొనే వారిలో ఒకరిద్దరు విజయం సాధిస్తారు. మిగిలినవారి భవిష్యత్తు దారుణంగా మారుతుంది అని ఆయన తెలిపేరు.

చిల్లర మరియూ సేవా వ్యాపార సంస్థలు


రీటైల్ షోరూములూ, మాల్స్, పెట్రోల్ బంకులు మరియూ ఇలాంటి వాటిలో బాల కార్మీకులను ఎక్కువగా చూడవచ్చు. వీరితో కనీసం 8 గంటల పనిమాత్రమే కాదు కదా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. కొన్ని చోట్ల బరువులు కూడా మోయిస్తున్నారు.

ఇంటి పనులు


డబ్బున్న వారి ఇళ్ళల్లో బాల కార్మీకులను ఎక్కువగా చూడవచ్చు. ఊర్ల నుండి బాల కార్మీకులను తెప్పించుకుని ఇంటి పనులు మొత్తం చేయించుకుంటున్నారు.

టూరిజం పని


బహుశ ఇది చాలామందికి అర్ధం కాకపోవచ్చు. టూరిజం కు ప్రత్యేకంగా పర్యాటకులను తీసుకువెళ్ళే వారు, ఆ పర్యాటకుల పనులు చేయడానికి వీరిని ఎక్కువగా వాడుతున్నారు. రూములు క్లీన్ చేయడం, బస్సులు క్లీన్ చేయడం, నౌకరీ ఇతరిత్రా పనులకు వాడుటున్నారు. పర్యాటకులకు ఈ బాల కార్మీకులు వీధి పిల్లలుగా కనబడతారు. కానీ వీరిని టూరిజం పరిశ్రమ వాడుకుంటుంది.

వీధి బాల కార్మీకులు


వీరు ఎక్కువగా తమ కుటుంబానికోసం పనిచేస్తారు.కొంతమంది తమ సొంత ఖర్చులకోసం పనిచేస్తారు. వీరిని చాలావరకు బానిసలుగా చూస్తారు. వీధి వ్యాపారస్తులు వీరిని తమ వ్యాపారంకోసం ఎలాపడితే అలా వాడుకుంటారు. వీరికి కమీషన్ మీద సరకులు ఇచ్చి అమ్మ మంటారు. వీరి జీవితం ఎప్పటికీ తెల్లారదు.

చిన్న తయారీ కంపెనీలు


చెప్పులూ, గ్లాసులూ,రబ్బర్ వస్తువులూ, బొమ్మలూ, టపాకాయలూ, అగ్గిపెట్టెలూ మరియూ ఈ మధ్య వస్తున్న ఆర్టిఫిషియల్ చెట్లూ తయారుచేసే కంపెనీలలో అతి తక్కువ జీతానికి పనిలో ఉంటారు.

బాల సైనికులు


17 దేశాలలో పిల్లలు యుద్దాలలో ఉపయోగించబడుతున్నారు. యుద్దాలలో మాత్రమే కాకుండా సైనిక దళాలకు వంటలు చేయడం, వారికి సేవలు చేయడం,గూడచార పనులకు కూడా ఉపయోగించుకుంటున్నారు.

దొంగతనంగా అమ్ముకోవడం


ఇది ఇప్పటి ప్రపంచంలోనే చాలా బాధకరమైన విషయముగా ఉన్నది. దొంగతనంగా పిల్లలను ఎత్తుకువెళ్ళి బానిసలుగా అమ్మేయడం, వారిని చట్ట విరోధ కార్యకలాపాలో ఉపయోగించుకోవడం సహజమైపోయింది. దీనిని ఎలా అరికట్టాలో ఎవరికీ అర్ధంకావటంలేదు.

No comments:

Post a Comment