Sunday, March 31, 2013

ఈ స్కూల్లో కొత్త అడ్మిషన్ మంత్రం: ఇద్దర్ని చేర్చండి...ఒకరికే ఫీజు కట్టండి....న్యూస్

చదువులను వ్యాపారంగా మార్చేరనడానికి ఇంతకంటే మరొ నిదర్శనం అక్కర్లేదు. "రెండు కొంటే ఒకటి ఫ్రీ" అనే వ్యాపార మంత్రాన్ని వ్యాపార దుకాణాలలోనే చూసేము. ఇప్పుడు అదే మంత్రమును ఒక విధ్యా సంస్థ బహిరంగంగా ఉపయోగించుకుంటోంది.

"మార్చ్-31 లోపు స్కూలు ఆవరణలోకి రండి...అడ్మిషన్ ఫీజులో రాయతీ పొందండి"......"ఇద్దరు పిల్లలను చేర్చండి...ఒకరికి మాత్రమే అడ్మిషన్ ఫీజు చెల్లించండి"

అలాగే "మీ పిల్లలను క్లాసులో మొదటి ర్యాంకు తెచ్చుకునేలా చదివించండి...వచ్చే సంవత్సరం ఫీజును స్కాలర్ షిప్ గా పొందండి" అని బహిరంగ ప్రకటనలు ఇచ్చింది.

ఇది బెంగులూరు లోని ఒక విధ్యా సంస్థ ఇచ్చిన ప్రకటన. బెంగులూరు పొలిమేరలలో స్కూల్లు విచ్చలవిడిగా మొలకెత్తినాయి. అందువలన ఆ స్కూల్లలో క్లాసు రూములు నింపాలి. లేకపోతే ఆ స్కూల్లలో పనిచేస్తున్న టీచర్లకు జీతాలు ఇవ్వడం కష్టమైపోతుంది(స్కూల్ల అధినేతలు పోగుచేసుకోగా మిగిలిన డబ్బుతో).

ఇప్పుడున్న స్కూల్ ఫీజుల పోరటం, ద్రవ్యోల్బణం వలన తల్లితండ్రులు పడుతున్న ఆర్ధీక ఇబ్బందులను క్యాష్ చేసుకోవాలని స్కూల్ల అధినేతలు ఆరాటపడుతున్నారు. అందుకనే ఈ వ్యాపార మార్కెటింగ్ టెక్నిక్ లను ఉపయోగిస్తున్నారు. ఇద్దర్ని చేర్పిస్తే స్పెషల్ డిస్కౌంట్, ఒక సంవత్సరానికి ముందే ఫీజు కట్టేస్తే మరో స్పెషల్ డిస్కౌంట్, రెండు,మూడు సంవత్సరాల ఫీజు ఒకేసారి కడితే ఫీజులలో ఎప్పుడూ ఒక ప్రత్యేక డిస్కౌంట్...ఇలా ఎన్నో రకాల ఆఫర్లు అందిస్తున్నారు.


ఇది వ్యాపారం మరియూ మార్కెటింగ్ టెక్నిక్ కాదా అని ఒక పత్రికా విలేకరి అడిగితే "మా స్కూల్లో అడిమిషన్ ఫీజు 35,000 నుండి 45,000 దాకా ఉన్నది. మేము 2,000 నుండి 3,000 దాకా డిస్కౌంట్ ఇస్తాము. ఇది వ్యాపార టెక్నిక్ కాదు. మా స్కూల్ మీద తల్లితండ్రులు ఉంచుకున్న నమ్మకానికి బహుమతి" అని ఒక స్కూల్ అధినేత చెప్పేరు.

"మా స్కూల్లలో సీట్లు మిగిలిపోకుండా ఉండటానికి మేము ఫీజులలోనూ, ట్రాన్స్ పోర్ట్ ఫీజులలోనూ 50 శాతం తగ్గిస్తాము. ఇందులో తప్పేముంది" అన్నరు ఇంకో స్కూల్ అధినేత.

"ఎంతో కష్టపడి చోటు కొనడానికీ,కట్టడాలకూ, వసతులకూ, పర్మిషన్లకూ ఎన్నో కోట్లు ఖర్చుపెడుతున్నాము. మేము పెట్టే ఖర్చులతో పాటూ మా పెట్టుబడులు రావాలి, మాకు లాభాలూ రావాలి కాబట్టి ఫీజులు వేలలో తీసుకుంటాము. ఇవన్నీ పిల్లల దగ్గర నుండి రాబట్టుకొవలసిందే. తల్లితండ్రులు ఇష్టపడి వస్తుంటే మధ్యలో మీకెందుకండీ కష్టం" అన్నారట మరొ స్కూల్ అధినేత.

No comments:

Post a Comment